మెగాస్టార్‌ సినిమా తర్వాత ఎన్టీఆర్‌తోనే….

another movie in koratala siva and ntr combination
Share Icons:

హైదరాబాద్, 16 ఆగష్టు:

మాటల రచయిత నుండి దిగ్గజ దర్శకుడిగా ఎదిగిన కొరటాల శివతో సినిమా చేయటానికి స్టార్ హీరోలందరూ ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ప్రభాస్, మహేశ్ బాబు, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో చేసిన కొరటాల దర్శకత్వంలో నటించడానికి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా సిద్ధమైపోయారు. ఈ ఏడాది డిసెంబ‌ర్‌లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంద‌ని తెలుస్తోంది.

ప్రతి సినిమాతో ఏదొక మెసేజ్ ఇచ్చే కొరటాల… మెగాస్టార్ కోసం మంచి కమర్షియల్ అంశాలుతో కూడిన ఓ సోషల్ మెసేజ్ సబ్జెక్ట్‌ను సిద్ధం చేస్తున్నారట.

కాగా, ఫిల్మ్ వర్గాల తాజా సమాచారం ప్రకారం మెగాస్టార్‌తో సినిమా త‌ర్వాత కొర‌టాల శివ ఎన్టీఆర్‌తో తన తదుపరి చిత్రాన్ని చేయనున్నారట. ఇటీవల కొరటాల.. ఎన్టీఆర్‌ను కలిసి ఒక లైన్ చెప్పారట. వినోదానికి సందేశాన్ని జోడించి కొరటాల చెప్పిన లైన్ నచ్చడంతో, ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. 2020లో ఈ చిత్రం మొదలవనుందని తెలుస్తోంది.

ఇక వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ వసూళ్ల పరంగా కొత్త రికార్డులను నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఎమోషన్ .. యాక్షన్ తో కూడిన ఈ సినిమా, ఎన్టీఆర్ కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచింది.

మామాట: మాస్ సినిమాలో మెసేజ్‌తో మెప్పిస్తున్న కొరటాల….

Leave a Reply