ఆపరేషన్ కమలం: టీడీపీకి రాజీనామా చేసిన మరో నేత…

Share Icons:

అమరావతి:

 

ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకి వరుస షాకులు తగులుతున్న విషయం తెలిసిందే. ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. అలాగే మరికొందరు నేతలు అదే బాట లో ఉనరు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాకు చెందిన ఆ పార్టీ నేత చందు సాంబశివరావు పార్టీకి రాజీనామా చేశారు. అధినేత చంద్రబాబుకు అత్యంత విధేయుడిగా పేరున్న సాంబశివరావు రాజీనామా నేతలకు షాక్‌కు గురిచేసింది.

 

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాలో శాస్త్రవేత్తగా పనిచేసిన సాంబశివరావు 2004లో టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో  గుంటూరు జిల్లా దుగ్గిరాల(పాత) నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఇక టీవీ చర్చల్లో టీడీపీ వాణిని బలంగా వినిపించడంలో ముందుండే సాంబశివరావును ఎమ్మెల్సీని చేస్తారన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే, చంద్రబాబు ఆయనకు  రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) డైరెక్టర్ పదవి ఇచ్చారు.

 

ప్రస్తుతం గుంటూరు జిల్లా టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. అయితే ఈ సమయంలో ఆయన టీడీపీకి రాజీనామా చేయడం నేతలను షాక్‌కు గురిచేసింది. త్వరలోనే ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం జరుగుతోంది.

 

అటు ప్రకాశం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఈదర హరి బాబు అనుకున్నట్లే బీజేపీలో చేరారు. ఇటీవల బీజేపీలో చేరిన మాజీమంత్రి సుజనా చౌదరి ప్రోత్సాహంతోనే ఈదర చేరి నట్లు భావిస్తున్నారు. అయితే ఈదర మాత్రం ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వం స్ఫూర్తిని చ్చిందని, అందుకే బీజేపీ పార్టీలో చేరానని ప్ర కటించారు. మంగళవారం ఢిల్లీలో బీజేపీ కార్య నిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈదర ఆ పార్టీలో చేరారు.

 

ఈదర 1994 లో టీడీపీ తరఫున ఒంగోలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో టీడీపీ రెబల్‌ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత కొంతకాలం కాంగ్రెస్‌లో కొనసాగారు. తిరిగి తెలుగుదే శంలోకి వచ్చి 2009లో ఒంగోలు టీడీపీ అభ్యర్థి గా పోటీచేసి ఓటమి చెందారు. గత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పొన్నలూరు జడ్‌పీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. జడ్‌పి ఛైర్మన్‌ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం, వైసీపీల మధ్య నెలకొన్న ప్రత్యేక రాజకీయ వాతావరణంలో జడ్పీ ఛైర్మన్‌గా గెలుపొంది కోర్టు అనుకూల ఉత్తర్వులు రావటంతో కొనసాగుతున్నారు.

Leave a Reply