టీడీపీ సభ్యుడు పక్కనకూర్చున్న వంశీ…స్లిప్స్ అందించిన అంబటి…

vallabhaneni vamsi comments on chandrababu
Share Icons:

అమరావతి: టీడీపీ నుంచి సస్పెండ్ అయిన వల్లభనేని వంశీ ఏపీ అసెంబ్లీలో వెరైటీగా నడుచుకుంటున్నారు. ఇప్పటికే వంశీని ప్రత్యేక సభ్యుడిగా స్పీకర్ తమ్మినేని గుర్తించిన సంగతి తెలిసిందే. ఆయన ఎక్కడైనా కూర్చోవచ్చని స్పీకర్ స్పష్టం చేశారు. అయితే నాలుగోరోజు అసెంబ్లీ సమావేశాల్లో 2430 జీవో, మీడియా ఆంక్షలు విషయంపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో వైసీపీ సభ్యులకు సభలో అంశాలపై వంశీ స్లిప్స్ రాసి పంపారు. సభ హాట్ హాట్‌గా ఉన్న సమయంలో పలు అంశాలపై ఎమ్మెల్యే అంబటికి స్లిప్స్ పంపారు. అయితే ఇవాళ టీడీపీ సభ్యులు కూర్చునే చోట మొదటి వరుసలో వంశీ కూర్చున్నారు. టీడీపీ ఎమ్మెల్యే బాలా వీరంజనేయ స్వామి పక్క సీట్లో వంశీ కూర్చున్నారు. అయితే అసెంబ్లీలో ఇవాళ వంశీ వ్యవహరించిన తీరు మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.

ఇదిలా ఉంటే మంత్రి అవంతి శ్రీనివాస్ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. వైసీపీలోకి వెళ్లి మంత్రి అవుతానని టీడీపీ అధినేత చంద్రబాబుకే చెప్పానని అసెంబ్లీలో అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. అయితే తాను ఈ మాట బాబుకు చెప్పగా.. ‘నువ్వు గెలుస్తావు కానీ ఆ పార్టీ గెలవదు’అని చెప్పారన్నారు. వైఎస్‌ చనిపోయాక చంద్రబాబులో మార్పు వచ్చిందన్నారు. ఎన్నికలకు చాలా టైమ్‌ ఉంది చంద్రబాబు గౌరవం తగ్గించుకోవద్దని ఆయన తెలిపారు. మీడియా స్వేచ్ఛ గురించి చంద్రబాబు మాటలు హ్యాస్యాస్పదమని అవంతి చెప్పుకొచ్చారు.

అటు టీడీపీ హయాంలో తన పట్ల పోలీసులు దారుణంగా ప్రవర్తించారని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలపట్ల మార్షల్స్ వ్యవహారించిన తీరుపై ఇవాళ పెద్ద చర్చే జరిగింది. టీడీపీ ప్రభుత్వంలో చస్తూ బతికానని.. చంద్రబాబు పుట్టిన నియోజకవర్గంలో గెలవడం తప్పా? అని ఈ సందర్భంగా చెవిరెడ్డి ప్రశ్నించారు. తిరుపతిలో ధర్నా చేస్తే కడప సెంట్రల్‌ జైల్లో వేశారని.. తీవ్రవాదిని కొట్టినట్టు పోలీసులు తనను కొట్టారని చెవిరెడ్డి చెప్పుకొచ్చారు. కనీసం తలనొప్పి మాత్ర కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని ఆయన ఆరోపించారు.

 

Leave a Reply