రెండో భాగంలో దివిసీమ సీన్లు హైలైట్ కానున్నాయా….

another interesting topic reveal in ntr biopic
Share Icons:

విజయవాడ, 15 అక్టోబర్:

సినిమా ప్రకటించిన దగ్గర నుండి ఏదొక అప్‌డేట్ ‘ఎన్టీఆర్’ సినిమా నుండి వస్తూనే ఉంది. మొదటి నుండి ఈ సినిమా స్టోరీ ఏంటి అనేది అందరిలో ఓ చర్చ నడుస్తుంది. ముందులో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవ్వడంతో మొదటి భాగం ముగుస్తుందని తెల్సింది. కానీ తాజా సమాచారం అది వాస్తవం కాదని వినిపిస్తోంది.

మొదటి పార్ట్ కీలకంగా డ్రామానే వుంటుదని, ఇప్పుడు యూనిట్ హడావుడి చేస్తున్న సినిమా నటులు, పాటలు, సీన్లు అన్నీ కలిపి గట్టిగా అరగంట మాత్రమే వుంటాయని తెలుస్తోంది.

ఎన్టీఆర్ చిన్నప్పుడు నుండి పెళ్లి చేసుకున్నా కొన్నాళ్ల వరకు హరికృష్ణ..చంద్రబాబు తో ఉండే అనుబంధం గురించి ఈ మొదటి పార్ట్ లో చూపించనున్నాడట క్రిష్.

ఇక రెండో భాగంలో రాజకీయం, దివిసీమ ఉప్పెన వంటి వ్యవహారాలు వుంటాయని తెలుస్తోంది. ఇందులోనే ఎన్టీఆర్ రాజకీయ రంగంలోకి ఎలా వెళ్ళాడు దానికి కారణాలు ఏంటి అనేవి చూపిస్తారంట. బాలకృష్ణ పాత్రలో బాలయ్య కనిపించనున్నాడు. కానీ బాలయ్య సీన్స్ చాలా తక్కువని సమాచారం. సెకండ్ పార్ట్ లో రానా..కళ్యాణ్ రామ్ లా పాత్రలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయని యూనిట్ సభ్యులు అంటున్నారు. ఫస్ట్ పార్ట్ మొత్తం ఎమోషన్లు, డ్రామాగా ఉంటుందని..సెకండ్ పార్ట్ లో దివిసీమ ఉప్పెన పార్ట్ హైలైట్ గా ఉంటుందని సమాచారం. మరి రోజురోజుకి ఈసినిమాపై పెరుగుతున్న అంచనాలు ఈ సినిమాను ఎంత వరకు తీసుకుని వెళ్తుందో చూడాలి. ఇక జనవరిలో ఈసినిమా విడుదల అవుతుందని అధికారంగా ప్రకటించారు.

మామాట: సినిమా విడుదలయ్యేవరకు రోజుకో ఆసక్తికరమైన విషయం బయటకొస్తూనే ఉంటుంది….

Leave a Reply