టీడీపీకి ఇంకో తలనొప్పి…

Share Icons:

చిత్తూరు, 21 మార్చి:

ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ…టీడీపీకి సరికొత్త షాకులు తగలుతున్నాయి. ఇటీవలే నెల్లూరు రూరల్ అభ్యర్ధి ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీలో చేరిన విషయం తెల్సిందే. అలాగా శ్రీశైలం అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్ రెడ్డి పోటీ చేయలేనని చేతులెత్తేశారు. ఈ క్రమంలోనే పూతలపట్టులో టీడీపీ తరఫున తెర్లాం పూర్ణంకు టికెట్ ఖరారు చేశారు. అయితే, బుధవారం నుంచి ఆయన కనిపించకుండా పోయారు. గురువారం ఉదయం అకస్మాత్తుగా టీడీపీ కార్యాలయంలో ప్రత్యక్షం అయ్యారు. అయితే, పూర్ణం వైసీపీలో చేరుతున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ, అనారోగ్యంతో చికిత్స చేయించుకోవడానికి వెళితే తనపై తప్పుడు ప్రచారం చేశారని పూర్ణం ఆరోపించారు. పూతలపట్టులో హైడ్రామా జరగడంతో టీడీపీ అధిష్టానం వెంటనే అభ్యర్థిని మార్చేసింది.

పూర్ణం స్థానంలో లలితకుమారి అలియాస్ లలితా థామస్‌ను అభ్యర్థిగా ఖరారు చేసినట్టు సమాచారం. గత కొన్నిరోజులుగా లలిత కుమారికే టికెట్ దక్కుతుందంటూ ప్రచారం జరిగింది. ఆమె కూడా నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. కానీ, చివరి నిమిషంలో పూర్ణం టికెట్ దక్కించుకున్నారు. ఇప్పుడు మళ్లీ లలితకుమారికి అవకాశం ఇచ్చారు. పూతలపట్టులో వైసీపీ తరఫున ఎంఎస్ బాబు బరిలో దిగుతున్నారు.

మామాట: మొత్తానికి టీడీపీకి ఊహించని షాకులు తగులుతున్నాయి…

Leave a Reply