మరో ముగ్గురు ఎమ్మెల్యేలని ప్రభుత్వ విప్‌లుగా నియమించిన జగన్…

Share Icons:

అమరావతి, 12 జూన్:

ఏపీ నూతన శాసనసభలో ఐదుగురు ఎమ్మెల్యేలను సీఎం జగన్ ప్రభుత్వ విప్‌లుగా నియమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వ విప్‌లుగా మరో ముగ్గురికి అవకాశం దక్కింది. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలను విప్‌లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అంతకముందు రాయచోటి ఎమ్మెల్యే గడిచోట శ్రీకాంత్‌రెడ్డిని చీఫ్‌ విప్‌ (కేబినెట్‌ హోదా)గా నియమించగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాడుగు ఎమ్మెల్యే బూడి ముత్యానాయుడులను విప్‌లుగా నియమించారు. ఇక వీరితో కలుపుకుని మొత్తం విప్‌ల సంఖ్య ఎనిమిదికి చేరినట్టయింది.

Leave a Reply