నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం ఏంగెలా మార్కెల్

Share Icons:
-జననీరాజనాలు అందుకున్న జర్మని మాజీ చాన్స్‌లర్

ప్రజాభిమానానికి అధికారం కొలమానం కాదు. పాలకులెవరైనా జన హృదయాల్లో చిరస్థాయిగా ఉండాలంటే ఎన్నికల్లో ఇచ్చిన అవకాశాన్ని ప్రజా సేవకు సద్వినియోగం చేసుకుని దేశాభివృద్ధికి పాటుపడితే కోరకుండానే కోట్లాది హృదయాల్లో ఆరాధ్యులుగా నిలిచిపోతారు. ఇందుకు భాష, ప్రాంతం, దేశం అంటూ పరిధులుండవు. ఇందుకు తార్కాణమే ఇటీవల 18 సంవత్సరాల సుదీర్ఘకాలం జర్మనీని ప్రగతిపథంలో నడిపించి ప్రపంచ మహిళ గా పేరొంది పదవీ విరమణ చేసిన, జర్మనీ తొలి మహిళా చాన్స్‌లర్ ఏంగెలా మెర్కెల్.

 

18 ఏళ్ళ దీర్ఘకాలం 80 మిలియన్ల జర్మనీ వాసులను తన మేధ, సామర్థ్యం, సాహసం, అంకితభావం, సేవాదృక్పథాలతో వివాదరహితంగా సుపరిపాలన అందించిన ఏంగెల మెర్కెల్ పదవీ విరమణ సందర్భంగా నభూతో న భవిష్యతి రీతిలో యావత్ దేశం వీధుల్లోకి వచ్చి, బాల్కనీల్లో నిల్చుని ఆరు నిముషాల పాటు కరతాళ ధ్వనులు మిన్నుముడుతుండగా ఘనమైన వీడ్కోలు చెప్పారు. ప్రచారంకోసం ఫొటోలకోసం ఏనాడూ పాకులాడకుండా ఆమె చేసిన సేవకు ప్రజలు సముచితరీతిలో కృతజ్ఞతలు తెలిపారూఅరు. ఇంతటి అపూర్వసంఘటన దేశంలో ఇదే ప్రథమమని చరిత్రను లిఖించాయి ప్రచార, ప్రసార మాధ్యమాలు.

 

18 ఏళ్ళ పాలనాకాలంలో ఎక్కడా అమె అధికారం పరిధులు దాటారన్న ఒక్క ఆరోపణకికూడా ఆనీ, బంధుప్రీతి చూపి పదవికట్టబెట్టారన్న అభియోగం కానీ ఒక్కటి కూడా ఎదుర్కోలేదు. పదవీకాలంలో తానేదో ఘనకార్యాలు సాధించానని ప్రగల్భాలూ చెప్పుకోలేదు. జీతభత్యాలుగా ఆమె మిలియన్ల పారితోషికమూ అందుకోలేదు. తన పనితనాన్ని మెచ్చుకోమని ఎవరినీ ఏనాడూ పన్నెత్తి కోరలేదు. సాధ్యంకాని వాగ్దానలూ చేయకపోవడమే కాదు, ఆమె పూర్వం పదవుల్లో ఉన్నవారితో ఘర్షణలూ, వాగ్యుద్ధాలకూ పాల్పడలేదు. పార్టీ అధినేత స్థానానికి గుడ్ బై చెప్పి తదనంతర నేతలకు బాధ్యత అప్పగించి గౌరవప్రదంగా పదవినుండి వీడ్కోలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె సేవా తత్పరతను  కీర్తించిన జనసందోహం సంతోషానికి, గౌరవ భావానికి  అంతంలేదు,

 

లీప్‌జిగ్ విశ్వవిద్యాలయం నుంచీ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ పొంది తదనంతరం ఫిజికల్ కెమిస్ట్రీలో డాకటరే సాధించిన మార్కెల్ తన ప్రతిభాపాటవాలను జర్మనీఅభివృద్ధికి సంపూర్ణంగా వినియోగించారు. ఆమె కాలం తమ దేశానికి ఒక స్వర్ణ యుగమని ప్రజల నుంచీ ప్రశంశలు అందుకున్నారు. తమ జీవన విధానానికి బంగరు బాట వేసి, ప్రపంచదేశాల్లో తమ దేశ ప్రతిష్ఠ ఇనుమడింపజేసి ఆన్నింటా ప్రథమ స్థానంలో నిలిపిన చాన్స్‌లర్ నేత పదవీ విరమణ వీడ్కోలు ఒక చారిత్రికాంశంగా తలచి, ఎవరి నుంచీ పిలుపులు, ప్రకటనలూ లేకుండానే స్వచ్ఛందంగా వృద్ధులు, పిల్లా పాప తేడా లేకుండా స్త్రీ పురుషులంతా ఆ సంతోషం పంచుకున్నారు. ఆ ఆరు నిముషాలూ కరతాళ ధ్వనులు జర్మనీ దేశ చరిత్రలో ఒక అపూర్వఘట్టం.

 

18 ఏళ్ళ పదవీ కాలంలో దేశాభివృద్ధి మినహా ఏ స్వార్థపూరిత ఆలోచన లేకుండా, సంపదపై కన్ను పెట్టకుండా, సుఖాలు, ఆస్తులు, పటాటోపాలాలోచనలకూ తావివ్వకుండా తామరాకుపై నీటిబొట్టు మాదిరి మసలుతూ కర్తవ్యం నిర్వహించానన్న తృప్తి ఆమెకు, ఆమె తమ నాయకురాలైనదన్న గర్వంతో ప్రజలూ తలపోసిన ఘడియలవి. ఒక్క బంధువుకైనా ఒక్క లాభదాయక స్థానం కల్పించకుండా ఒక ఆదర్శ వ్యక్తిత్వం నిలుపుకున్నారు ఏంగెలా మెర్కెల్. అంతే కాదు పదవిలోకి వచ్చిన మొదటి రోజు నుంచీ పదవీ విరమణ వరకూ ఆమే దుస్తులలో ఒక్క మార్పూ చోటుచేసుకోలేదు. ఆ రోజెలా ఉన్నారో చివరా ఆ మాదిరే నిరాడంబరంగా ఉన్నారు. ఏంగెలా పదవిని ఏనాడూ ఆమె బంధు, మిత్ర వర్గంలో  ఒక అవకాశంగా తీసుకోవాలన్న భావనే లేకుండా ఉండడం వారి గొప్పతనం కూడా.

 

చివరగా ఆమె విలేఖరుల సమావేశంలో మాట్లాడిన అంశాలు ఆమెను మరింత ఉన్నత స్థాయిలో నిలబెట్టాయి. మొదటి రోజు కనిపించిన దుస్తుల్లోనే ఉన్నారేంటి మాడం, మీకు మరో జత లేదా.. అని ఒక మహిళా విలేఖరి ప్రశ్నించగా, “నేనొక సాధారణ ప్రభుత్వ ఉద్యోగిని, మోడెల్ ను కాదుకదా,హరించడానికి రంగురంగుల, డిజైన్ల కొత్త దుస్తులు తడవతడవకూ మార్చడానికి” అని సమాధానమిచ్చారు. మరోక సమావేశంలో విలేఖరులు ఆమెను, “మీ ఇంటి పనికి, వంట పనికి.. నౌకర్లు ఎందరండీ?” అని అడగగా.. ” మాకెవరూ నౌకర్లు లేరు. ఇంటిపని వంటపని నేను నా భర్త కలసి చేసుకుంటాం” అని సౌమ్యంగా జవాబిచ్చారు మాజీ దేశాధినత. మరో విలేఖరి, ” ఇంట్లో దుస్తులు  మీరు ఉతుకుతారా, మీ భర్తనా?” అని తెలివిగా ప్రశ్నించగా, “బట్టలన్నీ నేను సిద్ధం చేస్తాను, ఆయన వాషింగ్ మిషన్ మీటలు నొక్కుతారు. అదికూడా సాధారణంగా రాత్రుళ్ళు, మా అపార్ట్ మెంట్లోని పొరుగువారి ప్రశాంతతకు భంగం కలగకుండా..  విద్యుత్ వాడకం మీద వత్తిడిపడకుండా..” అంటూ చిరునవ్వుతో జవాబిచ్చి.. ” ఇంకా మీరు నన్నేదో పెద్ద ప్రశ్నలు.. అంటే నా ప్రభుత్వ విజయాలు, వైఫల్యాల గురించి, పని తీరు, ప్రజల సంతృప్తి లాంటి విషయాలు అడుగుతారనుకున్నాను” అని మర్మగర్భంగా చురకలంటించారు.

 

పదవీ విరమణ అనంతరం ఆమె సాధారణ పౌరురాలి జీవనం మొదలెట్టారు. చాన్స్‌లర్ పదవీస్వీకారినికి ముందు ఆమె, ఆమె భర్త ఎక్కడ నివసించేవారో.. తిరిగి ఆ అపార్ట్మెంట్ కి చేఉకున్నారు. పదవిలో ఉన్నామని  పాత నివాసాన్ని వదులుకుని కొత్త విల్లా సొంతం చేసుకోలేదు. నేడూ ఆమెకు చాకిరి చేసే నౌకర్లు లేరు. ఈత కొలనులు, ఉద్యానవనాలు ఉన్న విల్లా ఏర్పరచుకోలేదు. అదీ నాయకత్వ నిరాడంబరత్వం.

 

(Translation)

Leave a Reply