పటాస్ నుంచి తప్పుకున్న యాంకర్ శ్రీముఖి..

Share Icons:

హైదరాబాద్, 15 మే:

ఈటీవీ ప్లస్ చానల్‌లో వచ్చే పటాస్ షో…ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇందులో యాంకర్లుగా ఉన్న రవి, శ్రీముఖిలకు కూడా మంచి క్రేజ్ వచ్చింది. అయితే ఈ షోలో శ్రీముఖి తన గ్లామర్‌తో యూత్‌ని బాగా ఆకట్టుకుంది.

అలాంటి శ్రీముఖి ఈ షో నుంచి కొంతకాలం పాటు బ్రేక్ తీసుకుంటున్నట్టుగా చెప్పింది. నిర్వాహకుల అనుమతితోనే తాను బ్రేక్ తీసుకుంటున్నన్నట్టు ఒక వీడియో చేసి మరీ వదిలింది. ఈ షోలో ఆమె లేని లోటు తప్పకుండా తెలుస్తుంది.

అయితే  ‘పటాస్’ షో వేదికపై కనిపించే కొంతమంది ఆర్టిస్టులు ఈ షోకి దూరమైన సమయంలో, శ్రీముఖి ఇలా బ్రేక్ తీసుకోవడం అనుమానాలకు తావిచ్చే అవకాశం లేకపోలేదు. 

మామాట: మరి పటాస్ షోలో అసలు ఏం జరుగుతుందో

Leave a Reply