మాజీ సీఎం భార్య ఇన్స్టాగ్రామ్ వీడియోపై సోషల్‌ మీడియాలో ‘ఆ డ్రెస్‌ ఏంటి’ అంటూ ట్రోలింగ్!

Share Icons:

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ భార్య అమృతా ఫడ్నవీస్‌ సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. ఆమెకు సంభంధించిన ఫోటోలు, వీడియోలు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా అమృత ఫడ్నవీస్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని షేర్‌ చేశారు. అది ఇప్పుడు తెగ వైరలవ్వడంతో పాటు విమర్శల పాలు చేస్తోంది. వీడియోలో ఆమె డ్రెస్సింగ్‌ చూసి జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు.

సింహళ పాట మణికే మాగే హితే ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ పాట పలు వర్షన్‌లు.. వేరు వేరు భాషల్లోకి డబ్‌ అవ్వడమే కాక అక్కడ కూడా హిట్‌ అయ్యింది. ఈ క్రమంలో తాజాగా అమృత ఫడ్నవీస్‌ కూడా ఈ పాటకు తనదైన శైలీలో కొన్ని మార్పులు చేయడమే కాక స్వయంగా ఆడి పాడారు. హిందీలో పాడిన ఈ పాట కోసం అమృత ఎరుపు రంగు టైట్‌ ప్యాంట్‌, టీ షర్ట్‌.. దాని మీద తెలుపు రంగు షర్ట్‌ ధరించారు.

అమృత గాత్రం, ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌ అన్ని సూపర్‌గా ఉన్నాయి. కానీ ఆమె ధరించిన బట్టలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు నెటిజనులు. మాజీ సీఎం భార్య.. అంటే ఎంత పద్దతిగా ఉండాలి… ‘ఆ డ్రెస్‌ ఏంటి’ మరీ ఇంత అతి అవసరం లేదు అంటూ ట్రోల్‌ చేస్తున్నారు నెటిజనులు.

సేకరణ :- మామాట డస్క్ (అంతర్జాల సంచికల నుండి)

Leave a Reply