ఎన్టీఆర్ కోసం వస్తున్న బిగ్ బీ…

amitab bachan as chief guest for ntr aravinda sametha audio launch
Share Icons:

హైదరాబాద్, 11 సెప్టెంబర్:

టెంపర్ మొదలుకొని వరుస విజయాలతో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అరవింద సమేత’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రాన్ని ఎలాగైనా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని ఆలోచనలో ఉన్నారు యూనిట్ సభ్యులు. అందుకే తండ్రి చనిపోయిన బాధలో ఉండి కూడా వెంటనే షూటింగ్‌లో పాల్గొన్నాడు తారక్.

ఇక శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 11న విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈ చిత్ర ఆడియో వేడుకను సెప్టెంబర్ 20వ తేదీన నోవోటల్ హోటల్లో జరపాలని నిర్వాహకులు భావిస్తున్నారు.

అయితే ఈ వేడుకకు తొలుతగా మహేశ్ బాబుని లేదా నందమూరి బాలకృష్ణని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలనుకున్నారట. అయితే అనూహ్యంగా మరొకరి పేరు గట్టిగా వినిపిస్తుంది.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అరవింద సమేత ఆడియో వేడుకకు వస్తున్నట్టు ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆయనే రావడానికి కారణం లేకపోలేదు.

అరవింద సమేతలో బిగ్ బీ ఓ ముఖ్య పాత్ర పోషించారని, అయితే ఈ విషయాన్ని సినిమా విడుదలయ్యే వరకూ సీక్రెట్‌గా ఉంచి ప్రేక్షకులకు, అభిమానులకు సర్ప్రైస్ ఇవ్వాలని చిత్ర వర్గం భావిస్తోందని సమాచారం.

మామాట: ఈ వార్తలో నిజమెంతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే…

Leave a Reply