అమెరికాలోనూ రైతన్నల ఆత్మహత్యలు

Share Icons:

అమెరికా, జూలై2,   మనిషిని నమ్ముకోవద్దు-మట్టిని నమ్ముకో అని పాత సామెత. కానీ కాలం మారింది, ఇపుడు మట్టికూడా మోసగిస్తోంది. అది మన మట్టే కాదు.. అమెరికా మట్టికూడా అక్కడి రైతుల ఉసురుతీస్తోంది.  ఏ దేశానికైనా రైతే వెన్నుముక అని చెప్పుకోవడం తప్ప.. వారి సంక్షేమాన్ని పట్టించుకున్న నాథుడే లేడు. పేరుకు అగ్రరాజ్యమే అయినా ..  అమెరికా అన్నదాత పరిస్థితి 15 ఏళ్ల నాటి కంటే దుర్భరంగా ఉంది. చేసిన అప్పులు తీర్చలేక.. భవిష్యత్‌పై ఆశలు పెం చుకోలేక అక్కడి అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సెంటర్‌ ఫర్‌ డిసీ జ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) అనే సంస్థ రైతుల పరిస్థితులపై నిర్వహించిన పరిశోధనలో కీలక అంశాలు వెలుగుచూశాయి. అమెరికాలోని మరే ఇతర రంగంలో లేనన్ని ఆత్మహత్యలు వ్యవ సాయ రంగంలో చోటుచేసుకుంటున్నట్లు సీడీసీ వెల్లడించింది. వ్యవసాయం,వ్యవసాయ అనుబంధ రంగాలైన ఫిషరీస్‌,అడవుల పెంపకమే జీవనాధారంగా ఉన్న ప్రతీ లక్ష మందిలో 85 మంది ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారని పేర్కొంది. ప్రస్తుతం అమెరికాలోని రైతుల ఆత్మహత్యలు మునుపెన్నడూ లేనంతగా ఉన్నాయి. మూడు దశాబ్దాల నాటి పరిస్థితులను మళ్లీ గుర్తు చేస్తున్నాయని నిపుణులుచెబుతున్నారు. ఇతర దేశాల్లో మాదిరిగానే అమెరికాలోనూ గ్రామీణ ప్రాంతాల రైతులే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే వాతావరణంలో వస్తున్న మార్పులే రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయమే జీవనాధారంగా జీవిస్తున్న వారిలో గత ఒక్కనెలలోనే 60 వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు సీడీసీ తన నివేదిక ద్వారా వెల్లడించింది. అమెరికాలో ప్రస్తుతం నెలకొన్న వ్యవసాయ సంక్షోభం 1980 నాటి పరిస్థితులను గుర్తు చేస్తోంది. కాగా ఎక్కువ మంది రైతులు ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యలు చేసు కుంటున్నారని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.

మారుతున్న వాతావరణం..
వాతావరణంలోని మార్పుల కారణంగా చేతికొచ్చిన పంట నేలపాలు కావడం.. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడం వంటి కారణాలు రైతులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చేసిన అప్పులు తీర్చలేక.. ఆదుకునే నాథుడు లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక రైతుల విషయంలో అమెరికా ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు కూడా ఆత్మహత్యలకు ఒక కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.అమెరికా పంటలపై వ్యాపారులు ట్యారిఫ్‌లు విధించడం వల్ల ఆదాయం గణనీయంగా తగ్గిపోతోంది.

బీమా అందేనా..?
అయితే కేవలం వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా కాకుండా ఇతర ఆదాయ వనరులను కూడా వెతుక్కుంటే రైతుల ఆత్మహత్యలు తగ్గించవచ్చని నిపుణుులు చెబుతున్నారు. ఆరోగ్య బీమా పథకాలు కూడా రైతులకు కొంత వరకు ఆదుకుంటాయంటున్నారు.అయితే ఆరోగ్య భద్రత,మానసిక ఆరోగ్య సేవలు ఎంతో కీలకమైనవి..గ్రామీణ ప్రాంతాల రైతులకు బీమా కల్పించడం ద్వారా వారికి ధీమా కల్పించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఇటీవల సెనేట్‌ ఓ బిల్లును కూడా ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం ప్రతీ రైతుకు ఆరోగ్య బీమా ఉండాలి. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా బీమాలో కవర్‌ అయ్యేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

మామాట: అమెరికా మట్టి కూడా మాయలు నేర్చిందా?

Leave a Reply