పాక్‌కి మరోసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన అమెరికా….

america warns to pakistan about terrorism
Share Icons:

వాషింగ్టన్, 24 అక్టోబర్:

ఉగ్రవాదం అణచివేతలో పాకిస్థాన్ నిజాయతీగా వ్యవహరించకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పొంపియో హెచ్చరించారు. ఆఫ్ఘనిస్తాన్‌, పాక్ పశ్చిమ సరిహద్దు వెంబడి ఉగ్రవాదాన్ని అణచివేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కుంటరాని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

అయితే ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పాకిస్తాన్ వెళ్లిన తాను ఇదే విషయాన్ని ఆయనకు వివరించానని నిన్న మీడియాతో మాట్లాడిన పొంపియో వెల్లడించారు.

ఉగ్రవాద కార్యాకలాపాలకు పాకిస్తాన్ ఆశ్రయమివ్వకూడదని తాము కోరుకుంటున్నామని, తాలిబాన్, హక్కానీ వంటి ఉగ్రవాద సంస్థలకు పాక్ ఆశ్రయమివ్వరాదని ఆయన అన్నారు.

అలాగే పాకిస్థాన్ విషయంలో అమెరికా వైఖరిలో ఎలాంటి మార్పులేదని మరోసారి స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిజాయతీగా, సంతృప్తికరమైన చర్యలు తీసుకునే వరకూ పాక్‌కు రక్షణ సహాయం అందించబోమని తేల్చిచెప్పారు.

మామాట: మరి ఈ వార్నింగ్‌ని పాక్ ఎలా తీసుకుంటుందో…

Leave a Reply