మళ్ళీ ఇండియా తరుపున టీ20, వన్డేలు ఆడాలని ఉంది: రాయుడు

Ambati Rayudu eager to make a comeback to white-ball cricket
Share Icons:

ముంబై:

వరల్డ్ కప్ ముందు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు అంబటి రాయుడు ప్రకటించిన విషయం తెల్సిందే. వరల్డ్ కప్ కు ఎంపిక చేయకపోవడంతో పాటు, మధ్యలో ఆటగాళ్లు గాయపడితే తనను రిజర్వ్ ప్లేయర్ కోటాలో అయినా తీసుకోకపోవడం రాయుడ్ని బాధించింది. దాంతో అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్టు ఆవేశంగా ప్రకటించి సంచలనం సృష్టించాడు.

అయితే ఇప్పుడు రాయుడు తన నిర్ణయాన్ని రివర్స్ తీసుకోవాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం టీఎన్ సీఏ లీగ్ పోటీల్లో ఆడుతున్న రాయుడు గ్రాండ్ స్లామ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ, మున్ముందు టీమిండియా తరఫున టి20, వన్డేల్లో ఆడాలని భావిస్తున్నట్టు వెల్లడించాడు. అంతేకాదు, కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ లోనూ ఆడాలనుందని మనసులో మాట బయటపెట్టాడు.

మరి రాయుడు మళ్లీ ఆడాలన్న తాజా నిర్ణయాన్ని టీమిండియా సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకుంటారో? లేదో? వేచి చూడాలి.

Leave a Reply