అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్:  మొబైల్స్ పై డిస్కౌంట్లు…ఎస్‌బి‌ఐ కార్డు మీద ఆఫర్

Amazon sale to offer up to 40% discounts on OnePlus, Samsung, Xiaomi phones
Share Icons:

ముంబై: వినియోగదారులని ఆకర్షించడమే లక్ష్యంగా బంపర్ ఆఫర్లు ఇస్తున్న ఈ కామర్స్ సంస్థ అమెజాన్… మరో బంపర్ ఆఫర్ తో ముందుకొచ్చేస్తుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో స్మార్ట్ ఫోన్లపై భారీగా డిస్కౌంట్లు ఇవ్వనుంది. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4 వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్, అప్లయెన్సెస్, ఫర్నీచర్, ఫ్యాషన్ వేర్‌పై డిస్కౌంట్లు ప్రకటించింది అమెజాన్. వాటితో పాటు స్మార్ట్‌ఫోన్లపై ఏకంగా 40% వరకు డిస్కౌంట్ ఇచ్చే అవకాశముంది.

అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్, క్రెడిట్ కార్డులపై 10% అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది. డెబిట్ కార్డులపై, బజాజ్ ఫిన్‌సర్వ్ కస్టమర్లకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు ఉంటాయి. ఇక ఈ సేల్‌లో 15 కొత్త స్మార్ట్‌ఫోన్లు కూడా రిలీజ్ కాబోతున్నాయి. టాప్ స్మార్ట్‌ఫోన్స్ అయిన వన్‌ప్లస్ 7టీ, సాంసంగ్ ఎం10ఎస్, వివో యూ10, ఎంఐ ఏ3 మోడల్స్‌పై డిస్కౌంట్స్ ఉంటాయి.

సెప్టెంబర్25న వచ్చేస్తున్న రెడ్ మీ 8ఏ

చైనా మొబైల్స్ తయారీదారు షియోమీ సంస్థ…ఈ నెల 25న రెడ్ మీ 8ఏ స్మార్ట్ ఫోన్ ని విడుదల చేయనుంది. … ఇప్పుడు రెడ్‌మీ 8 సిరీస్‌పై దృష్టిపెట్టింది. ఇప్పటికే చైనాలో రెడ్‌మీ నోట్ 8 ప్రో, రెడ్‌మీ నోట్ 8 రిలీజ్ అయ్యాయి. అవి త్వరలో ఇండియాకు రాబోతున్నాయి. వాటికన్నా ముందు ఇండియాలో రెడ్‌మీ 8ఏ లాంఛ్ అవుతుంది.

రెడ్‌మీ 8ఏ స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్‌ప్లే: 6.21 అంగుళాల హెచ్‌డీ+

ర్యామ్: 4 జీబీ

ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ

రియర్ కెమెరా: 12 మెగాపిక్సెల్

ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్

బ్యాటరీ: 5,000 ఎంఏహెచ్

నాయిస్ షాట్స్ ఎక్స్-బడ్స్

ప్రముఖ వియరబుల్, స్మార్ట్‌ఫోన్ యాక్ససరీస్ తయారీదారు నాయిస్.. షాట్స్ ఎక్స్-బడ్స్ పేరిట నూతన వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను భారత్‌లో తాజాగా విడుదల చేసింది. ఈ ఇయర్ బడ్స్ సహాయంతో మ్యూజిక్ వినవచ్చు. అలాగే కాల్స్ కూడా ఆన్సర్ చేయవచ్చు. బ్లూటూత్ 5.0 ఆధారంగా ఈ ఇయర్‌బడ్స్ పనిచేస్తాయి. ఆండ్రాయిడ్, ఐఫోన్లకు ఈ బడ్స్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌ను వీటికి అందిస్తున్నారు. వీటిని ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 4 గంటలకు పైగా నాన్‌స్టాప్‌గా ఉపయోగించుకోవచ్చు. ఇక ఈ ఇయర్ బడ్స్‌ను రూ.3,999 ధరకు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.

 

Leave a Reply