అదిరిపోయే ఆఫర్లతో అమెజాన్ ప్రైమ్ డే సేల్…. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో 10శాతం తగ్గింపు

amazon prime day sale starts in july 15
Share Icons:

ముంబై:

 

దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్…వినియోగదారులని ఆకట్టుకునేందుకు అదిరిపోయే ఆఫర్లతో ప్రైమ్ డే సేల్‌ను నిర్వహించనుంది. ఈ నెల 15,16 తేదీల్లో ఈ సేల్ జరగనుంది. ఇందులో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, యాక్ససరీలు, ఫ్యాషన్ ఉత్పత్తులు, అప్లయన్సెస్‌పై భారీ తగ్గింపు ధరలు, ఆఫర్లను అందివ్వనుంది. సేల్‌లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ ఎం10, గెలాక్సీ ఎం20, ఎల్‌జీ డబ్ల్యూ10, హానర్ 10 లైట్, షియోమీ ఎంఐ ఎ2 ఫోన్లపై భారీ తగ్గింపు ధరలను అందివ్వనున్నారు.

 

అలాగే హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేస్తే 10 శాతం అదనపు డిస్కౌంట్ ఇవ్వనున్నారు. సేల్‌లో అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు, బజాజ్ ఫిన్‌సర్వ్ ఈఎంఐ కార్డులతో ఉత్పుత్తులను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నారు.

 

ఇందులో భాగంగా యువత కోసం ‘అమెజాన్ ప్రైమ్ యూత్ ఆఫర్’ ప్రకటించింది. 18 నుంచి 24 ఏళ్ల వయస్సుగల వారెవరైనా కేవలం రూ.499 చెల్లించి అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ పొందొచ్చు. ముందుగా రూ.999 చెల్లించి ఏడాదికి అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకుంటే రూ.500 క్యాష్‌బ్యాక్ ఇస్తుంది అమెజాన్. రూ.500 క్యాష్‌బ్యాక్ అమెజాన్ పే అకౌంట్‌లోకి వస్తుంది. ఈ క్యాష్‌బ్యాక్‌ను అమెజాన్‌లో ప్రొడక్ట్స్ కొనడంతో పాటు బిల్ పేమెంట్స్, రీఛార్జ్, బుక్‌మై షో, స్విగ్గీ, డొమినోస్, రెడ్‌బస్ లాంటి ఆన్‌లైన్ పార్ట్‌నర్ మర్చంట్స్‌కి పేమెంట్ కోసం ఉపయోగించుకోవచ్చు. రూ.499 ధరకే అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ పొందాలంటే వయస్సు ధృవీకరించడానికి ఏవైనా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి.

Leave a Reply