నేటి నుంచి అమెజాన్ ప్రైమ్ సేల్

Share Icons:

ముంబై, జూలై 16,      ప్రైమ్ మెంబర్స్ కోసం మాత్రమే ప్రత్యేకంగా పెట్టిన సేల్‌ను అమెజాన్ ప్రారంభించింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు మొదలైన ఈ సేల్ 36 గంటల పాటు కొనసాగనుంది. అంటే మంగళవారం అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ సేల్ ఉంటుంది. మొబైల్స్, టాబ్లెట్స్, ల్యాప్‌టాప్స్, స్టోరేజ్ డివైసెస్, టీవీలపై ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మొత్తం ఆరు ఫ్లాష్ సేల్స్ కూడా ఉంటాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై పది శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ ఇవ్వనున్నారు.

సోమవారం మొబైల్ ఫోన్లపై ఉన్న ఆఫర్లు

మొబైల్స్‌పై అమెజాన్ బ్లాక్‌బస్టర్ ఆఫర్స్ అంటూ ప్రకటించింది. ఇందులో భాగంగా హానర్ 7ఎక్స్ (4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) వేరియంట్‌పై వెయ్యి డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ ఫోన్ ఇప్పుడు రూ.13999కే అందుబాటులోఉంది. ఇక హువావీ పీ20 లైట్‌ను రెండు వేలు తక్కువకు.. అంటే రూ.17999కే సొంతం చేసుకోవచ్చు. దీనికితోడు ఇండియాలో తొలిసారి వన్‌ప్లస్ 6 రెడ్ మొబైల్ సేల్ కూడా ఉండనుంది. దీని ధర రూ.39999. ఎక్స్‌చేంజీపై రూ.2 వేల వరకు తగ్గింపు కూడా ఉంది. రెడ్ మీ వై 2 ప్రైమ్ ఓన్లీ ఫ్లాష్ సేల్ జులై 17 మధ్యాహ్నం 12 గంటలకు ఉంటుంది. ఇక సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 8ను భారీ డిస్కౌంట్‌కు అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ పొందవచ్చు. ఇది రూ.12 వేలు తక్కువకు.. అంటే రూ.55900కే అందుబాటులో ఉంది. వివో ఫోన్లు రూ.3 వేల తగ్గింపు ధరకు అందుబాటులో ఉన్నాయి. దీనిపై అదనంగా రూ.6 వేల వరకు ఎక్స్‌చేంజ్ ఆఫర్ ఉంది. ఇక మోటో జీ6పై రూ.2 వేలు, మోటో ఈ5 ప్లస్‌పై వెయ్యి ఎక్స్‌చేంజ్ ఆఫర్లు ఉన్నాయి. ఒప్పో ఫోన్లపై రూ.4 వేల వరకు డిస్కౌంట్.. రూ. 3 వేల వరకు ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. సామ్‌సంగ్ ఫోన్లపై అయితే ఏకంగా రూ.10700 వరకు తగ్గింపు ధరలు ఉండటం విశేషం. అంతేకాదు రూ.10 వేల వరకు ఎక్స్‌చేంజ్ ఆఫర్, 9 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ దీనికి అదనం.

టీవీలు, ల్యాప్‌టాప్స్‌పై డిస్కౌంట్లు

బోస్ క్యూసీ25 కేవలం రూ.12600కే అందుబాటులో ఉంది. కెనాన్ ఎంట్రీ లెవల్ ఈవోఎస్ 1300డీ ధర రూ.20990గా ఉంది. దీనికితోడు సాయంత్రం 6 గంటలకు ఫ్లాష్ సేల్ ఉంటుంది. ఇందులో భాగంగా ఒక టీవీ ధరకు రెండు టీవీలు పొందే అవకాశం కల్పించారు. ఇక జులై 17 ఉదయం 9 గంటలకు ఉన్న ఫ్లాష్‌సేల్‌లో టీసీఎస్ 65 అంగుళాల స్మార్ట్‌టీవీపై రూ.32 వేల డిస్కౌంట్ ఇస్తున్నారు. ఎంపిక చేసిన కెనాన్, నికాన్ డీఎస్‌ఎల్‌ఆర్‌లపై కూడా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇక అమెజాన్ ఉత్పత్తులపై కూడా భారీ డిస్కౌంట్లు ప్రకటించారు. ఇక ఎల్‌జీ, సోనీ, టీసీఎల్‌లాంటి ప్రీమియం కంపెనీల ఓఎల్‌ఈడీ టీవీలపై కూడా ప్రైమ్ డే ఎక్స్‌క్లూజివ్ ఆఫర్లు ఉన్నాయి. కొన్ని డీల్స్ సోమవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానున్నాయి.

 

మామాట: వ్యాపారం అంటే తక్కువకు కొని ఎక్కువకు అమ్మడం… కాదా

Leave a Reply