ఎకో షో 8 స్మార్ట్‌ డిస్‌ప్లే..ఉపయోగాలు ఇవే…

Share Icons:

ముంబై: ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌.. ఎకో షో 8 పేరిట నూతనంగా ఓ స్మార్ట్‌ డిస్‌ప్లేను భారత్‌లో విడుదల చేసింది. ఈ డివైస్‌ను వినియోగదారులు రూ.12,999 ధరకు అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు. గతేడాది సెప్టెంబర్‌లో ఇతర దేశాల్లో ఈ డివైస్‌ విడుదల కాగా ప్రస్తుతం దీన్ని అమెజాన్‌ భారత్‌లో లాంచ్‌ చేసింది. ఇందులో 8 ఇంచుల హెచ్‌డీ రిజల్యూషన్‌ ఉన్న టచ్‌ స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. రెండు ఇంచుల నియోడైమియం స్పీకర్లు, పాసివ్‌ బేస్‌ రేడియేటర్‌లను ఈ డివైస్‌లో అందిస్తున్నారు. దీన్ని వైఫైకి కనెక్ట్‌ చేసుకోవచ్చు. అలాగే అలెక్సా వాయిస్‌ అసిస్టెంట్‌కు ఇందులో సపోర్ట్‌ను అందిస్తున్నారు. దీంతో యూజర్లు ఆన్‌లైన్‌లో తమకు కావల్సిన సమాచారం వెదకవచ్చు. అలాగే మ్యూజిక్‌ కూడా వినవచ్చు.

హార్మోనిక్స్‌ ట్విన్స్‌ 2

హార్మోనిక్స్‌ ట్విన్స్‌ 2 పేరిట నూతన ఇయర్‌బడ్స్‌ను పోర్ట్రోనిక్స్‌ కంపెనీ భారత్‌లో తాజాగా విడుదల చేసింది. రూ.2499 ధరకు ఈ ఇయర్‌బడ్స్‌ను వినియోగదారులు అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు. బ్లూటూత్‌ 5.0 ద్వారా ఈ ఇయర్‌బడ్స్‌ ఫోన్లకు కనెక్ట్‌ అవుతాయి. వీటికి ఐపీఎక్స్‌4 వాటర్‌, స్వెట్‌ రెసిస్టెన్స్‌ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఇవి చార్జింగ్‌ కేస్‌తో 12 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను  ఇస్తాయి.

ఆపిల్‌ డేస్‌ సేల్‌

ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు ఆపిల్‌ డేస్‌ సేల్‌ పేరిట ఓ ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా ఐఫోన్‌ XR, ఐఫోన్‌ XS, ఐఫోన్‌ 11 సిరీస్‌ ఫోన్లపై తగ్గింపు ధరలను అందిస్తున్నారు. ఐఫోన్‌ XS ఫోన్‌కు చెందిన 64జీబీ వేరియెంట్‌ను రూ.5వేల డిస్కౌంట్‌తో ఈ సేల్‌లో కొనుగోలు చేయవచ్చు. అలాగే ఐఫోన్‌ 11 సిరీస్‌ ఫోన్లపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కార్డులతో డిస్కౌంట్లను అందివ్వనున్నారు. ఇక ఈ ఫోన్లను నో కాస్ట్‌ ఈఎంఐ విధానంలోనూ వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.

 

Leave a Reply