పెద్ద మనసు చాటుకున్న కుబేరుడు….

Amazon chief Jeff Bezos gives $2bn to help the homeless
Share Icons:

టెక్సాస్, 14 సెప్టెంబర్:

అపర కుబేరుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్…తన పెద్ద మనసు చాటుకున్నాడు. తన భార్య  మేక్‌కెన్జీతో కలిసి ఇల్లు లేని వారి కోసం, ప్రీ స్కూల్స్ నిర్మాణం కోసం ‘డే వన్ ఫండ్’ పేరుతో ఏకంగా 200 కోట్ల నిధిని ఏర్పాటు చేశారు. ఈ నిధులతో ప్రపంచవ్యాప్తంగా ఇల్లు, ప్రీ స్కూళ్ల కోసం భవనాలు నిర్మించనున్నారు. అలాగే ఈ నిధిని ‘డే 1 ఫ్యామిలీస్ ఫండ్’, ‘డే 1 అకడమిక్స్ ఫండ్’ మధ్య విభజిస్తున్నట్లు తెలిపారు.

‘డే 1 ఫ్యామిలీస్ ఫండ్‪ను వివిధ సంస్థలకు, సివిక్ గ్రూపులకు నాయకత్వ అవార్డులు ప్రధానం  చేయడానికి కేటాయిస్తున్నామని, యువ కుటుంబాల తక్షణ అవసరాలు పరిష్కరించేందుకు, ప్రత్యేకించి కూడు, గూడు వసతి కల్పించడానికి కేటాయిస్తామని బెజోస్ ట్వీట్ చేశారు.

‘డే 1 అకడమిక్ ఫండ్ సాయంతో అణగారిన వర్గాల వారికి పూర్తిస్థాయి అత్యున్నత ప్రమాణాలతో కూడిన స్కాలర్ షిప్ కల్పిస్తూ మాంటిస్సొరీ స్ఫూర్తితో ప్రీ స్కూళ్లు ఏర్పాటు చేయడానికి నిధులు కేటాయిస్తాం’ అని బెజోస్ తెలిపారు.

సేవ చేయాలన్న నిర్ణయాన్ని గతేడాదే తీసుకున్నానని, ఇందుకోసం పలువురి నుంచి సలహాలు, సూచనలు కూడా తీసుకున్నట్టు బెజోస్ ఈ సందర్భంగా తెలిపారు.

మామాట: మంచి పని చేస్తున్నారు…

Leave a Reply