అమెజాన్‌లో చౌక ధరలకు మోటో ఫోన్లు..!

అమెజాన్‌లో చౌక ధరలకు మోటో ఫోన్లు..!
Views:
17

న్యూఢిల్లీ, 13 ఫిబ్రవరి:

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో మోటోకు చెందిన స్మార్ట్‌ ఫోన్లు భారీ తగ్గింపు ధరలకు లభిస్తున్నాయి. వాలెంటైన్స్‌డే సందర్భగా ఈ ఆఫర్‌ను అందిస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది.

కాగా, ఈనెల 13 నుంచి 15 వరకూ పరిమిత కాలం వరకూ ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది.

ఈ ఆఫర్‌లో భాగంగా నిర్వహిస్తున్న సేల్స్‌లో పలు మోటో ఫోన్లు భారీ తగ్గింపు ధరలకు వినియోగదారులకు లభ్యమవుతున్నాయి.

అమెజాన్‌లో నిర్వహిస్తున్న ప్రత్యేక మోటో ఫోన్ల సేల్‌లో మోటో జీ5 రూ.11,999 ఉండగా రూ.8,499కే లభిస్తున్నది. అలాగే రూ.16,999 ధర ఉన్న మోటో జీ5 ప్లస్ రూ.6వేలు తగ్గి రూ.10,999కు లభిస్తుండగా, రూ.13,999 ఉన్న మోటో జీ5ఎస్ రూ.11,999కు, రూ.16,999 ఉన్న మోటో జీ5ఎస్ ప్లస్ రూ.13,999కు లభిస్తున్నాయి.

ఇక ఈ ఫోన్లకు గాను పాత ఫోన్లను ఎక్స్‌ఛేంజ్ చేస్తే అదనంగా మరో రూ.2వేల వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు.

అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపును ఆఫర్‌ చేస్తుండటంతో వినియోగదారులు ఈ అవకాశం ఉపయోగించుకోవాలని మోటో కోరింది.

మామాట: ఎగబడి కొనేసుకుంటారేమో….

English Summary: Amazon India is hosting a special Motorola smart phones sale ahead of Valentine’s Day. The offers are valid on the Moto G5s, Moto G5s Plus and last generation Moto G5 and Moto G5 Plus the offer is running on the e-commerce website from February 13th to February 15th.

(Visited 1 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: