రేవంత్‌కు అమరావతి జే‌ఏ‌సి ఆహ్వానం…

revanth reddy fires on kcr govt in the issue of disha case
Share Icons:

హైదరాబాద్:  అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి పరిసర గ్రామాల రైతులు, ప్రజలు సుమారు 70 రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అటు జే‌ఏ‌సి కూడా అమరావతి కోసం ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని జేఎసీ నిర్ణయం తీసుకొంది.

ఈ మేరకు పలు రాజకీయపార్టీలు ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఈ నెల 29వ తేదీన అమరావతిలో ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం పలికింది జేఎసీ.

ఈ సమావేశానికి తెలంగాణకు చెందిన నేతలను కూడ ఆహ్వానం పలికింది అమరావతి జేఎసీ. కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, టీజేఎస్ చీఫ్ కోదండరామ్‌కు కూడ జేఎసీ నుండి ఆహ్వానం అందింది. అయితే వీరిద్దరూ ఈ సమావేశానికి హాజరు అవుతారా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో జేఎసీ ఛైర్మెన్ గా కోదండరామ్ వ్యవహరించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో సాగిన ఉద్యమంలో కోదండరామ్ పాత్రను విస్మరించలేం. ప్రస్తుతం అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని ఆందోళన చేస్తున్న జేఎసీ భవిష్యత్తు కార్యాచరణను సిద్దం చేసేందుకు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.

అటు ఏపీ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే అమరావతికి అనుకూల వైఖరి తీసుకుని జగన్‌ను విమర్శిస్తున్న నేపథ్యంలో… రేవంత్ రెడ్డి కూడా వారి బాటలోనే పయనించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఏపీ సీఎం జగన్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మధ్య సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో… రేవంత్ రెడ్డి వీరిద్దరిపై విమర్శలు చేసే ఛాన్స్ ఉందనే ఊహాగానాలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఈ సమావేశానికి టీజేఏసీ మాజీ చైర్మన్ కోదండరామ్ కూడా హాజరుకానుండటంతో… ఆయన, రేవంత్ రెడ్డి కలిసి ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

 

Leave a Reply