ఇన్‌సైడర్ ట్రేడింగ్: టీడీపీ నేతలకు బిగిస్తున్న ఉచ్చు..

main leaders ready to leave tdp
Share Icons:

అమరావతి: గత ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ నేతలు అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ ఆరోపణలు నేపథ్యంలో టీడీపీ నేతలపై కేసులు కూడా నమోదు చేశారు. అటు రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన తెల్ల రేషన్‌కార్డుదారులపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 700మందికిపైగా తెల్ల రేషన్‌ కార్డుదారులపై కేసులు ఫైల్ చేశారు. రూ.3కోట్ల చొప్పున భూముల్ని కొనుగోలు చేసినట్టు సీఐడీ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. దీని కోసం స్పెషల్ టీమ్‌లను రంగంలోకి దించింది.

అమరావతిలో మొత్తం 796 రేషన్‌కార్డుదారులు.. రూ.300కోట్లతో భూమి కొనుగోలు చేసినట్లు సీఐడీ గుర్తించింది. అలాగే మాజీ మంత్రులు నారాయణ, పుల్లారావులపై కేసులు నమోదయ్యాయి. వెంకటాయపాలెంకు చెందిన పోతురాజు బుజ్జి అనే దళిత మహిళ.. తనను మభ్యపెట్టి తనకు సంబంధించిన 99సెంట్ల భూమిని కొనుగోలు చేశారని ఫిర్యాదు చేసింది. ఇద్దరిపై సెక్షన్‌ 420, 506,120(బి) కేసులను నమోదు చేశారు. మంత్రులతో పాటూ స్థానిక టీడీపీ నేత, వెంకటాయపాలెం మాజీ సర్పంచ్‌ బెల్లంకొండ నరసింహాపై కేసులు నమోదయ్యాయి.

ఇక సీఐడీ అధికారులు భూములు కొనుగోలు చేసిన రాజకీయ నేతలపై ఫోకస్ పెట్టారట.. ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులు సంగతి అలా ఉంటే అమరావతిలో రాజధాని భూముల కొనుగోలులో మనీలాండరింగ్‌ జరిగినట్లు సీఐడీ అనుమానిస్తోందట. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా మనీ ల్యాండరింగ్‌ జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారట. అందుకే ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని ఈడీకి సీఐడీ లేఖ రాసిందట. తాజాగా తెల్ల రేషన్‌కార్డుదారులకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు సంబంధించి దర్యాప్తులో వెల్లడయ్యే అంశాలపై ఈడీకి ఎప్పటికప్పుడు నివేదిక ఇస్తామని సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్ చెబుతున్నారు.

 

Leave a Reply