ఇన్‌సైడ్ ట్రేడింగ్: అడ్డంగా బుక్ కానున్న బాబు సన్నిహితుడు

chandrababu comments on ap govt
Share Icons:

అమరావతి: గత ఐదేళ్లు టీడీపీ నేతలు అమరావతిలో చేసిన ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఏపీ ప్రభుత్వం విచారణ చేయిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురిపై కేసులను నమోదు చేసిన సీఐడీ అధికారులు… తాజాగా మరో ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. కృష్ణా జిల్లా విజయవాడ, పెనమలూరు, పోరంకి, యనమలకుదురు ప్రాంతాలకు చెందిన వారిపై కేసులు నమోదయ్యాయి. తప్పుడు పత్రాల ద్వారా తెల్ల రేషన్ కార్డులు పొందిన వీరంతా రాజధాని ప్రాంతంలో భూములు కొన్నారని కేసులు నమోదు చేశారు. ఇప్పటికే టీడీపీ మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణలపై సీఐడీ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే చంద్రబాబు సన్నిహితుడుగా ఉన్న అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత బీజేపీ నేత గోనుగుంట్ల సూర్యనారాయణ (వరదాపురం సూరి) కూడా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడి రూ.400 కోట్ల విలువైన భూములు కొనుగోలు చేసినట్లు తెలిసింది. తన భార్య గోనుగుంట్ల నిర్మలమ్మ, కాంట్రాక్టు సంస్థ నితిన్‌సాయి కన్‌స్ట్రక్షన్స్‌ పేరుతో రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలో భారీగా భూములు కొన్నట్లు తెలిసింది.

ఇక సీఆర్‌డీఏ పరిధిలోని పలు మండలాల్లోనూ 56 ఎకరాలకు పైగా భూమిని కొన్నారని,  వీటి విలువ రూ. 400 కోట్లకుపైగా ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో.. సూరి కుటుంబ ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టిన సీఐడీ.. ఆదాయానికి మించి ఆస్తులు కొనుగోలు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించింది. అలాగే, మనీల్యాండరింగ్‌కు కూడా పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చి ఆయనపై చర్యలు తీసుకోవాలని ఐటీ, ఈడీలకు నివేదిక అందజేసింది.

 

Leave a Reply