ఇన్‌సైడర్ ట్రేడింగ్: మరికొందరుపై సి‌ఐ‌డి కేసు..

amaravati capital changing news
Share Icons:

అమరావతి: గత ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ నేతలు అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం పలువురు పేర్లని కూడా బయటపెట్టి , వారిపై విచారణ చేస్తుంది. ఈ క్రమంలోనే  మాజీ మంత్రులు ప్రతిపాటి పుల్లారావు, నారాయణపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. రాజధాని ప్రాంతం ఇక్కడే వస్తుందని తెలిసి తెల్లరేషన్ కార్డు దారుల పేరుతో భూములు కొనుగోలు చేసి ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారనే అభియోగాలపై సీఐడీ విచారిస్తోంది. ఇవాళ మరో ఏడుగురిపై కేసు నమోదు చేసింది.

తెల్లరేషన్ కార్డుదారులు అబ్దుల్ జమేదార్, కొండలరావు పొలినేని, మండవ నాగమణి, మండవ అనురాధ, బొల్లినేని నరసింహరావు, భూక్యా నాగమణి సహా మరొకరిపై సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. వీరే గాక 791 మంది తెల్లరేషన్ కార్డుదారుల పేరుతో వేల ఎకరాల భూములను కొనుగోలు చేశారని సీఐడీ ఆధారాలు సేకరించింది.

అమరావతి రాజధాని ప్రాంతంలో దళితుల నుంచి మాజీ మంత్రులు ప్రతిపాటి పుల్లారావు, పీ నారాయణ బలవంతంగా భూములు కొనుగోలు చేశారని సీఐడీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. దళిత మహిళల నుంచి భూములు కొనుగోలు చేశారని ఎఫ్ఐఆర్‌లో సీఐడీ పేర్కొంది. అయితే వారు ఇష్టంతో కాకుండా బలవంతంగా భూములు కొనుగోలు చేశారని వివరించింది.

మాజీ మంత్రులు పుల్లారావు, నారాయణపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వారిద్దరూ నేరపూరిత కుట్ర చేశారని, మోసం చేశారని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తదితర సెక్షన్ల కింద కేసులు ఫైల్ చేశారు. ల్యాండ్ పూలింగ్‌పై సీఐడీ విచారణ కొనసాగుతోంది.

రాజధాని ప్రాంతంలో 796 తెల్లరేషన్ కార్డుదారులు ఎకరం రూ.3 కోట్లు పెట్టి భూమి ఎలా కొనుగోలు చేశారని సీఐడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో తెల్లరేషన్ కార్డు వారు కొనుగోలు చేసిన భూముల విలువ రూ.300 కోట్ల పై మాటే అని సీఐడీ గుర్తించింది.

 

Leave a Reply