అమరావతి ఉద్యమం: యువకుల దీక్ష భగ్నం..ఎన్‌ఆర్‌ఐల మద్ధతు..

amaravati farmers protest
Share Icons:

అమరావతి: మూడు రాజధానులు వద్దంటూ…అమరావతి ప్రాంత రైతులు గత 54 రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.  రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ డిమాండ్ చేస్తూ 55 వ రోజు కూడా అమరావతి గ్రామాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధానిని తరలించవద్దంటూ రైతులుమందడం, తుళ్లూరులో ధర్నాలు చేపట్టారు. వెలగపూడిలో రిలే దీక్షలు 55వ రోజుకు చేరాయి. మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.

ఇదిలా ఉంటే రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలకు తమ నిరసన తెలపాలన్న లక్ష్యంతో వెలగపూడి శిబిరంలో యువ రైతులు శ్రీకర్‌, రవిచందర్‌లు 151 గంటల పాటు నిరాహార దీక్షకు దిగారు. యువరైతులకు రాజధాని గ్రామాల ప్రజల నుండి మద్దతు లభించింది. పెదపరిమి నుంచి పెద్ద ఎత్తున యువత, మహిళలు, రైతులు ర్యాలీగా వచ్చి వారికి సంఘీభావం తెలిపారు. దీంతో వీళ్ల దీక్షను పోలీసులు భగ్నం చేశారు.

వీరి దీక్ష ఆదివారం అర్ధ రాత్రి వరకు 112 పాటు దీక్ష చేసిన వీరి ఆరోగ్య పరిస్థితి క్షిణిస్తోందని, షుగర్‌ లెవల్స్‌ పడిపోతున్నాయని వైద్యులు చెప్పడంతో వారిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అయితే యువ రైతులు ఆస్పత్రిలో కూడా దీక్ష కొనసాగిస్తామని తేల్చి చెప్పారు . రాజధానిగా అమరావతినే కొనసాగాలని డిమాండ్ చేశారు . ఇక రాజధాని రైతుల పోరాటానికి ప్రవాసాంధ్రుల నుండి మద్దతు లభిస్తుంది.

ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానులు, అధికార వికేంద్రీకరణ నేపథ్యంలో రాజధాని అమరావతి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని ఎన్‌ఆర్‌ఐ జేఏసీ నిర్ణయించింది. అమెరికాలో తెలుగువారుండే ప్రాంతాల నుంచి ప్రధానికి నరేంద్రమోదీకి వినతి పత్రాలు పంపించాలని నిర్ణయించినట్లు ఎన్ఆర్‌ఐ జేఏసీ ప్రకటించింది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేసింది. అమెరికాలోని రాష్ట్రాల రాయబార కేంద్రాలు, తెలుగువారు ఉన్న 70కి పైగా దేశాల నుంచి ప్రధాని నరేంద్రమోదీకి వినతిపత్రాలు పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మొత్తానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోయినా, అమరావతి రైతులు మాత్రం ఆందోళనలు ఆపడం లేదు.

 

Leave a Reply