రాజధాని మార్పుపై వార్తలు…దొనకొండలో పెరిగిన భూముల రేట్లు

amaravati capital changing news
Share Icons:

అమరావతి:

 

గత కొన్ని రోజులుగా ఏపీ రాజధాని అమరావతి మార్పుపై వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కృష్ణా నదికి వరదలు వచ్చిన నేపథ్యంలో రాజధాని లంక గ్రామాలు ముంపుకు గురయ్యాయి. దీంతో మున్సిపాల్ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వరదల వల్ల రాజధానికి ముప్పు ఉందని, రాజధాని మార్పుపై ఆలోచిస్తున్నామని ప్రకటించారు.

 

దీంతో రాజధాని మారుతుందని వార్తలు వస్తున్నాయి. అలాగే మారితే ఏపీ కొత్త రాజధాని ఏది అన్న అంశం చర్చకు దారితీస్తోంది. ఈ క్రమంలో ఎక్కువ మంది చెబుతున్నదీ, చెప్పుకుంటున్నదీ ప్రకాశం జిల్లాలోని దొనకొండ గురించే. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ దొనకొండ చుట్టూ భూముల కొనుగోళ్లు పెరిగాయి. ఎవరెవరో ఆ ఊరికి రావడం… పంట పొలాల్నీ, ఖాళీ స్థలాల్నీ కొనుక్కోవడం వంటివి చాలా జరిగాయి.

 

ఐతే… రాజధాని అవుతుందనే ఉద్దేశంతోనే ఈ కొనుగోళ్లు జరుగుతున్నాయని చాలా మందికి తెలియదు. ఇప్పుడు తాజా పరిణామాలతో… ఆ కొనుగోళ్ల వెనక… ఈ రాజకీయ ఎత్తుగడ ఉండి ఉండొచ్చన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఏది ఏమైతేనేం… ఇప్పుడు దొనకొండ చుట్టుపక్కల భూముల రేట్లు బాగా పెరిగాయి

 

ఈ రెండ్రోజుల్లోనే… సాధారణ భూములు సైతం లక్షలు పలుకుతున్నాయి. ఇక రాజధాని మార్పు ఉండదని గతంలో సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు మళ్ళీ రాజధానిపై క్లారిటీ లేకపోవడంతో ప్రజల్లో అనుమానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం జగన్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన అక్కడి నుంచి రాగానే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది

 

Leave a Reply