అమరావతిలో అవినీతి

Share Icons:

 

గతంలో మనకు రాజుల సొమ్ము రాళ్లపాలు అనే సామెత ఉండేది. మహరాజులు తమ మెహర్బానీ కోసం గుళ్లు, గోపురాలు, మందిరాలు, ఇలా అనేక నిర్మాణాల కోసం ప్రజాధనం వ్యయం చేసేవారు. కానీ నేడు ప్రజల సొమ్ముని ప్రభుత్వాలు వృధా చేస్తున్నాయి.

[pinpoll id=”66616″]

 

ఎందుకంటే.. 2014 లో రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరిగింది. కనీస పాలనా కేంద్రం లేకుండా, రాజధానిని నగరం అన్నది లేకుండా రాష్ట్రాన్ని విభజించారు. ఆ సమయంలో చంద్రబాబు విపత్కర పరిస్థితిని సానుకూల దృక్పథతంతో అవకాశంగా మలచుకుని  మనమే మంచి రాజధాని కట్టుకుందా మంటే… ప్రజలువిశ్వసించారు. ఆ నేపథ్యంలో ప్రభుత్వం రైతుల నుంచి 33 వేల ఎకరాల వరకూ భూమిని రాజధానికోసం సేకరించింది.

అంత వరకూ బాగానే ఉందనుకున్నా, ఆ తరువాతే అసలు కథ మొదలైంది. అమరావతిలో రూ. లక్ష కోట్లు కాదు .. ఇంకా ఎక్కువే స్కాం జరిగిందనిపిస్తోంది. ఆర్బీఐకి స్థలం ఎకరానికి రూ. 4. కోట్లకు  ఇచ్చారు. ప్రైవేట్ విద్యాసంస్థలకు, ఆసుపత్రులకు రూ. 50 లక్షలకే ఇస్తున్నారు. మిగతా మూడున్నర కోట్లు ఎక్కడకు పోతోందో?  అని విశ్రాంత న్యాయమూర్తి లక్ష్మణ రెడ్డి నిన్న ప్రశ్నించారు. మరి మీరేమంటారు. ఈ మాజీ న్యాయమూర్తి అనుమానాలతో మీరు ఏకీభవిస్తారా.. లేదా.. ?

మామాట: అమరావతి లోపల అన్నీ అనుమానాలే గా..

Leave a Reply