అమలాపాల్ ‘ఆమె’….కాజల్ ‘రణరంగం’

Share Icons:

హైదరాబాద్, 19 జూన్:

కథానాయిక అమలా పాల్ ప్రధాన పాత్రలో తమిళంలో ‘ఆడై’ సినిమా రూపొందుతోంది. రత్నకుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకి, విజ్జి సుబ్రహ్మణ్యం నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ సినిమాను తెలుగులో ‘ఆమె’ పేరుతో విడుదల చేయనున్నారు.

తాజాగా తెలుగు టీజర్ ను విడుదల చేశారు. వర్షం పడుతోన్న ఒక రాత్రివేళ ఒక స్త్రీ పోలీస్ స్టేషన్ కి వచ్చి తన కూతురు ఇంకా ఇంటికి రాలేదని ఫిర్యాదు చేయడంతో ఈ టీజర్ మొదలైంది. అమలా పాల్ కెరియర్లో ఈ సినిమా ప్రత్యేకమనేది యూనిట్ సభ్యులు చెబుతోన్న మాట.

ఇక అగ్రకథానాయిక కాజల్ ఇటీవలే తెలుగు ప్రేక్షకులను ‘సీత’ సినిమాతో పలకరించిన ఆమె, తదుపరి చిత్రంగా ‘రణరంగం’ చేస్తోంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో, శర్వానంద్ జోడీగా ఆమె కనిపించనుంది.

ఈ రోజున కాజల్ పుట్టినరోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి ఆమె ఫస్టులుక్ పోస్టర్ ను దర్శకుడు సుధీర్ వర్మ రిలీజ్ చేశాడు. సంతోషంతో బీచ్ లో ఆడిపాడుతున్నట్టుగా ఆమె ఈ పోస్టర్లో కనిపిస్తోంది. కాజల్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరెన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలు ఆమె చేయాలనే ఆకాంక్షను సుధీర్ వర్మ వ్యక్తం చేశాడు.

 

Leave a Reply