సీబీఐ కేసులో కేంద్రానికి షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు..

Share Icons:

ఢిల్లీ, 8 జనవరి:

సీబీఐ వర్సెస్ సీబీఐ కేసులో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. సీబీఐ డైరెక్టర్‌గా తిరిగి అలోక్ వర్మను నియమించాలని కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.

కాగా, గతంలో అలోక్‌ వర్మ అక్రమాలకు పాల్పడ్డారనీ, కీలక కేసుల దర్యాప్తు ముందుకు సాగనివ్వట్లేదని సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానా ఆరోపించిన సంగతి తెల్సిందే. ఇక రాకేశ్ ఆస్తానా అవినీతికి పాల్పడ్డారనీ, తన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని అలోక్‌వర్మ కూడా తిరిగి ఆరోపణలు గుప్పించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రం… సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న అలోక్‌ వర్మను గతేడాది అక్టోబర్ 23న రాత్రికి రాత్రి తప్పించి ఆ స్థానంలో కె.నాగేశ్వరరావును తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించింది.

ఇక వర్మతో పాటూ… ఆయనకు మద్దతుగా నిలుస్తున్న మరో 13 మందిని బదిలీ చేసింది. అయితే ఈ చర్య అప్పట్లో పెను దుమారం రేపింది. స్వతంత్రంగా వ్యవహరించే సీబీఐని కేంద్రం తన చెప్పు చేతల్లో పెట్టుకుంటోందని విపక్షాలు దుమ్మెత్తిపోశాయి.

అలాగే కేంద్ర ప్రభుత్వం తనను బాధ్యతల నుంచి తప్పించి, బలవంతంగా సెలవుపై పంపడాన్ని సవాల్ చేస్తూ ఆలోక్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు వెలువరించింది.

మామాట: బీజేపీ ప్రభుత్వానికి కోర్టు పెద్ద షాకే ఇచ్చింది..

Leave a Reply