కపిల్‌దేవ్ బయోపిక్‌లో బన్నీ….?

Share Icons:

హైదరాబాద్, 7 సెప్టెంబర్:

కబీర్ ఖాన్ దర్శకత్వంలో బాలీవుడ్‌లో కపిల్ దేవ్ బయోపిక్‌ను రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ బయోపిక్‌లో నటిస్తున్నట్లు ఫిల్మ్ నగర్లో ఒక వార్త షికారు చేస్తోంది.

కపిల్‌దేవ్ సారథ్యంలో 1983లో భారత్ క్రికెట్ జట్టు తొలిసారిగా ప్రపంచ కప్‌ను గెలుచుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్రపంచ కప్‌ని కపిల్ ఒంటి చేత్తో భారత్‌కి అందించాడు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఈ విజయంలో కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా ముఖ్యమైన పాత్రను పోషించారు.

ఇలా భారత్‌కి తొలి ప్రపంచ కప్‌ని అందించిన కపిల్‌దేవ్ బయోపిక్‌ని దర్శకుడు కబీర్ ఖాన్ తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. ఇక ఇందులో కపిల్ పాత్రకు రణ్ వీర్ సింగ్‌ను ఎంపిక చేసుకున్నారు. అలాగే కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రకి గాను బన్నీతో సంప్రదింపులు జరుపుతున్నారట. ఈ సినిమాకి ’83’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. బన్నీ ఓకే అంటే ఆయన బాలీవుడ్ లో చేసే మొదటి సినిమా ఇదే అవుతుంది.

మామాట: మరి ఈ పాత్ర చేయడానికి బన్నీ సై అంటాడా?

Leave a Reply