అబ్బాబ్బా అందరూ ఏం కవర్ చేసుకుంటున్నారు….

Share Icons:

అమరావతి, 25 ఏప్రిల్:

ఎన్నికలు అయిపోయాయి…ప్రజల ఓట్లన్నీ ఈవీఏంలలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇక ప్రజలు ఎవరి వైపు ఎక్కువ మొగ్గు చూపారు…ఎవరు గెలుస్తారనేది మే 23 వరకు ఎదురు చూడాలసిందే. అయితే ఈలోపు ఏపీలోని పార్టీలన్నీ ఎవరి లెక్కలు వారు వేసుకుంటూ…విజయం తమదంటే తమదని ప్రచారం చేసేసుకుంటున్నాయి. అది మనకు కలిసిరావచ్చు లేక ఇక్కడ మనకి అనుకూలంగా ఉందనుకుంటూ లెక్కలు వేసుకుంటున్నారు.

లోలోపల టెన్షన్ పడుతూ…దాన్ని కవర్ చేసుకుంటూ పైకి మాత్రం… తామే అధికారంలోకి వస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ ఎవరికి వారు వంద శాతం నమ్మకంతో చెబుతున్నారు.  కానీ ప్రజలు ఎవరి పక్షాన నిలిచారన్న టెన్షన్ వారికీ ఉందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. దీనంతటికీ కారణం ప్రజల నాడిని ఎవరూ పట్టుకోలేకపోవడమే.

సాధారణంగా ఓ పార్టీ గెలుపును కచ్చితంగా డిసైడ్ చేసే విషయంలో మహిళలు ముందుంటారు. వాళ్లు గనక తలచుకుంటే ఫలితాలు అటు ఇటు అయిపోతాయి. ఇక్కడే పసుపు-కుంకుమ స్కీం వల్ల మహిళలు తమకే ఓటు వేశారని టీడీపీ అంటుంటే… అంతలేదు… నవరత్నాలు ఎంతో మేలు చేస్తాయన్న ఉద్దేశంతో మహిళలు తమకే ఓటు వేశారని వైసీపీ అంటోంది.

ఇక నెల పాటూ టెన్షన్లను భరిస్తూ ఉండటం కంటే… పోలింగ్ కేంద్రాల స్థాయిలో మొత్తం ఓటర్ల జాబితాను తెప్పించుకొని… ఒక్కో ఓటరూ ఎవరికి వేసి ఉంటారో తెలుసుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. అటు వైసీపీ హైకమాండ్ ఇలాంటివి చెయ్యకపోయినా, ఆల్రెడీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంస్థ ఐప్యాక్ కచ్చితమైన లెక్క ఇచ్చిందనీ, ఇక ఇతర లెక్కలు అవసరం లేదనీ జగన్ భావిస్తున్నట్లు తెలిసింది.

ఇక వీరికి విరుద్ధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరు ఉంది.  ప్రస్తుతం క్షేత్రస్థాయిలో సర్వేల వంటివి చేయించకపోయినా… ఆ పార్టీ నేతలు మాత్రం… టీడీపీ అధికారంలోకి వస్తుందా, వైసీపీ వస్తుందా అన్న అంశంపై లెక్కలు వేస్తున్నట్లు తెలిసింది. తాము కింగ్ మేకర్లం అవుతామన్న నమ్మకంతో ఉన్న ఆ పార్టీ నేతలు… అవకాశం వస్తే, అధికారంలో భాగస్వామ్యం అవుతామని ధీమాగా ఉన్నారు. మొత్తానికి అందరూ ఎంత కవర్ చేస్తున్న…లోపల మాత్రం ఫుల్ టెన్షన్‌లో ఉన్నారనేది తెలుస్తోంది.

మామాట: మే 23 వరకు టెన్షన్ పడాల్సిందే

Leave a Reply