శుక్రగ్రహంపై గ్రహాంతరవాసులున్నారట..!!

Share Icons:

అమెరికా, 3 ఏప్రిల్:

ఆకాశంలో ఫ్లయింగ్ సాసర్స్ కనిపించాయి…..ఆ ప్రాంతంలో గ్రహాంతరవాసులు జాడలున్నాయని తెలిసింది……అమెరికాలోని మిలిటరీ బేస్ `ఏరియా 51` ప్రాంతంలో ఏలియన్లపై పరిశోధనలు చేస్తున్నారట…..వేరే గ్రహాల్లో ఏలియన్లు నివసిస్తున్నాయి…..వారితో నాసా శాస్త్రవేత్తలు సంభాషిస్తున్నారట……ఇవన్నీ ఏలియన్ల గురించి దశాబ్దాల నుంచి ప్రచారంలో ఉన్న పుకార్లు. అయితే వీటిలో ఏ ఒక్కదానికి ఆధారాలు లేవు. దీంతో అసలు ఏలియన్లు ఉన్నాయా? లేవా?  అన్న సందేహాలు పలువురిని తొలచివేస్తున్నాయి. ఆ సందేహాలను పటాపంచలు చేస్తూ  గ్రహంతరవాసుల జాడ గురించి బాంబు లాంటి వార్తను పేల్చింది నాసా. భూమికి పొరుగునే ఉన్న శుక్రగ్రహంపై వాటి ఆనవాళ్లను కనుగొన్నట్లు ప్రకటించింది..

aliance on venus

ఏలియన్లు ఉన్నాయని వాటి ఉనికి నిజమేనని దివంగత స్టీఫెన్ హాకింగ్స్ చాలా కాలం నుంచి చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన వాదనకు బలం చేకూరేలా నాసా ఓ ప్రకటన విడుదల చేసింది. “శుక్రగ్రహం లేదా వీనస్ మీద మేఘాల్లో నల్లటి జాడలను కనుగొన్నాం. అక్కడ జీవపదార్థాన్ని గుర్తించాం. బహుశా అక్కడే ఏలియన్లు నివసిస్తూ ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వీలైనంత త్వరలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది” అని నాసా ఒక ప్రకటనలో పేర్కొంది.

flying saser

రాళ్ళతో కూడిన కఠిన నేలను కలిగిన శుక్రగ్రహం పరిమాణం దాదాపుగా భూగ్రహ పరిమాణం అంతే ఉంటుంది. సూర్యునికి అతి దగ్గరలో ఉండటం వలన అత్యధిక వేడిని తనలో నిలుపుకొనటం వలన ఇక్కడ వాతావరణం దారుణంగా అంటే 500 డిగ్రీ సెల్సియస్‌ ఉష్టోగ్రత, దానితో వాతావరణం అంతా ఆమ్లవర్షంతో ప్రతికూల పరిస్థితులను కలిగిఉంటుందన్నారు. ఈ వాతావరణ పరిస్థితులను తట్టుకుని ప్రత్యేక బృందం పరిశోధనలను కొనసాగించబోతోంది అని తెలిపారు. అయితే ప్రత్యేక జీవావరణం అక్కడ ఉన్నటువంటి అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకొనేలాగా ఉండవచ్చని బావించవలసి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక బృందం బయో కెమికల్‌, రసాయనిక అధ్యయనాలు చేపట్టే అవకాశం ఉంది.

ఏలియన్ల ఉనికి కోసం 240 మిలియన్ల డాలర్ల వ్యయంతో పరిశోధనలను కొనసాగించబోతున్నామని నాసా అధికారులు వెల్లడించారు. కాగా ఏలియన్ల ఉనికి గురించి నాసాకు చాలాకాలం క్రితమే తెలుసని ఆ వాస్తవాలను నాసా రహస్యంగా ఉంచుతోందని బకింగ్హమ్ యూనివర్సిటీ పరిశోధనకారుడు ప్రొఫెసర్ బారీ డి గ్రెగోరియో ఆరోపిస్తున్నారు. అంగారక గ్రహంలో ఏలియన్ల జాడను నాసా వారి క్యూరియాసిటీ రోవర్ కనిపెట్టిందని ఏలియన్ల ఫోటోలను తీసిందని ఆయన వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాసా తాజా ప్రకటన ఆసక్తికర చర్చకు దారితీసింది.

మామాట: ఏలియన్లు వస్తే అసలు ఏం జరుగుతుంది…?

English Summary:

Experts say they have spotted dark patches on the planet’s clouds that give weight to the theory microbes may be able to live there. The NASA-backed report reads: “Our comparative analyses support the blended hypotheses that terrestrial-type biology can survive within and contribute to the spectral signatures of Venus’ clouds.

Leave a Reply