అలీబాబా జాక్ మా రిటైర్మెంట్!

Share Icons:

కొత్త ఢిల్లీ, సెప్టెంబర్ 09,

ప్రస్తుతం జాక్ మా వయసు 54 సంవత్సరాలు. ఇక ఆలీబాబాకు సంబంధించి అన్ని బాధ్యతల నుంచి వైదొలిగి.. ‘విద్య’ మీద ఫోకస్ చేయాలని అనుకుంటున్నట్టుగా జాక్ మా తెలిపాడు.

ప్రఖ్యాత ఇ కామర్స్ సంస్థ ‘అలీబాబా’ వ్యవస్థాపకుడు, ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన జాక్ మా రిటైర్మెంట్ ప్లాన్స్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఒక చైనీస్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాక్ మా ప్రస్తుత హోదా నుంచి రిటైర్ అయ్యే ఆలోచనలో ఉన్నట్టుగా పేర్కొన్నాడు.

ప్రస్తుతం జాక్ మా వయసు 54 సంవత్సరాలు. ఇక ఆలీబాబాకు సంబంధించి అన్ని బాధ్యతల నుంచి వైదొలిగి.. ‘విద్య’ మీద ఫోకస్ చేయాలని అనుకుంటున్నట్టుగా జాక్ మా తెలిపాడు. విద్యారంగం అభ్యున్నతికి తన వంతు ప్రయత్నం చేస్తానని ఈ అపర కుభేరుడు ప్రకటించాడు. తన రిటైర్మెంట్ ఒక యుగానికి అంతం కాదు అని, మరో యుగానికి ఆరంభం అని జాక్ మా వ్యాఖ్యానించాడు.

‘అలీబాబా’ వ్యవస్థాపనకు ముందు జాక్ మా టీచర్‌గా పని చేశాడు. ఇప్పుడు మళ్లీ విద్యారంగం వైపుకు వెళ్తానని జాక్ ప్రకటించారు. 1999లో జాక్ ‘అలీబాబా’ను స్థాపించారు. చైనీయులకు ఆన్ లైన్ మార్కెటింగ్‌ను అలవాటు చేసిన ఘనత జాక్ దే. ఆ సంస్థ శరవేగంగా ఎదిగింది. జాక్ మా ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో ఒకరయ్యారు. ఇ కామర్స్ వ్యాపారంలో తన సామ్రాజ్యాన్ని భారీ ఎత్తున విస్తరించాడు. జాక్ మా ఒక న్యాచురల్ సేల్స్ మ్యాన్ అని ప్రపంచం కితాబిస్తుంది. జాక్ మా అనంతరం.. అలీబాబా బాధ్యతలను ఆ సంస్థలో పని చేస్తున్న ఇతర ఎగ్జిక్యూటివ్స్ తీసుకుంటారని తెలుస్తోంది.

మామాట:  అలాగే, చదువుకోవడానికి అడ్డేముంది

Leave a Reply