ఏపీలో అలీబాబా

Share Icons:

అమరావతి, ఆగష్టు 28,

ఆంధ్రప్రదేశ్ లో వివిధ రంగాలలో ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి చైనా కు చెందిన అలీబాబా క్లౌడ్ ఇండియా సంస్థ  మంగళవారం అవగాహన ఒప్పందం కుదుర్చికుంది.  ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు సమక్షం లో రాష్ట్ర ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సీఈఓ జాస్తి కృష్ణ కిషోర్, అలీబాబా క్లౌడ్ ఇండియా లిమిటెడ్ ఎండీ డాక్టర్ అలెక్స్ లీ ఒప్పందాలు మార్చుకున్నారు. ఆలీబాబా సంస్థ మధ్య చిన్నతరహా పరిశ్రమలు, పర్యాటకం, విద్య, రియల్ టైం గవెర్నెన్స్, టెక్నాలజీ రంగాల్లో సహాయ సహకారాలు అందించనుంది.  ఐటీ, నైపుణ్యాభివృద్ధి, అంకుర సంస్థల ప్రోత్సాహం, చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధిలో తన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనుంది.

చంద్రబాబుతో ఇండియన్ బ్యాంక్ డైరెక్టర్ భేటీ.. 

ముఖ్యమంత్రి చంద్రబాబును ఇండియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఎం.కె. భట్టాచార్య మంగళవారం మర్యాద పూర్వకంగా కలిసారు. ఉండవల్లిలో అయన  సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా కేరళ వరద బాధితులకు  సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల ఒకరోజు వేతనం రూ.14,83,336 ల చెక్కును సీఎం చంద్రబాబుకు అందజేసారు. వితరణ మొత్తాన్ని కేరళ సీఎంకు పంపాలని విజ్జ్ఞప్తి చేసారు. గతంలో ఎంవోయు జరిగిన మేరకు రూ. 5 వేల కోట్ల రుణం మంజూరుకు సత్వర చర్యలపై భట్టాచార్య  హామీ ఇచ్చారు. సీం చంద్రబాబు ఆధ్వర్యంలో  ఏపీ శీఘ్రంగా అభివృద్ధి చెందుతోందని భట్టాచార్య కితాబు నిచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని భట్టాచార్య హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంత బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

 

మామాట: ఆలీబాబా ఏ మాయచేస్తోడో చూడాలి. 

Leave a Reply