బిగ్ బాస్: అలీ-హిమజ మధ్య గొడవ….గాజుపెంకులు గుచ్చుకుని రవికి గాయం

ali-himaja fight in big boss telugu season episode
Share Icons:

 

హైదరాబాద్:

 

బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 3 బుధవారం ఎపిసోడ్ లో ఊహించని ఘటనలు జరిగాయి. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా హిమజ-అలీ ల మధ్య పెద్ద వార్ జరిగింది. చివరికి హిమజ సారీ చెబుతూ అలీ కాళ్ళ మీద కూడా పడింది. అటు టాస్క్ లో దొంగగా ఉన్న రవి బంగారం ఉన్న బాక్స్ ని బద్దలు గొట్టడంతో అద్దాలు పగిలి చేతికి గాయమైంది.

 

దొంగలున్నారు జాగ్రత్త అనే టాస్క్ లో భాగంగా నీళ్ళు తాగితే వంద రూపాయ‌లు ఇవ్వాల‌ని అలీ.. హిమ‌జ‌కి చెప్ప‌డంతో ఆమె ఇవ్వ‌కుండానే నీళ్ళు తాగేసింది. వాట‌ర్ అనేది ఊరిలో ఫ్రీగా ల‌భిస్తుంది. దానికి మ‌నీ ఎందుకు ఇవ్వాలి అని చెప్పింది. రెండో సారి కూడా హిమ‌జ నీళ్లు తాగే ప్ర‌య‌త్నం చేయ‌గా, ఆమెని అడ్డుకొని ఆమె ప్యాంట్ జేబులో వంద రూపాయ‌లు తీసుకునే ప్ర‌య‌త్నం చేశాడు అలీ. దీంతో ఆమె త‌న కాళ్ల‌తో అలీ మొహంపై రెండు సార్లు త‌న్నింది. అయితే నువ్వు నా ప్యాంట్ జేబులో చేయి ఎందుకు పెడ‌తావు.. పిచ్చి వేషాలు వేస్తే మొహం ప‌గిలిపోతుంద‌ని హిమ‌జ‌ గ‌ట్టిగా వార్నింగ్ ఇచ్చింది.

 

నువ్వు వాట‌ర్ తాగి డ‌బ్బులు ఎందుకు ఇవ్వ‌డం లేదు. మొహం మీద అలా త‌న్న‌డం క‌రెక్టా అని అలీతో పాటు ప‌లువురు ఇంటి స‌భ్యులు ఆమెని నిల‌దీశారు. దీంతో హిమ‌జ‌.. అలీకి సారి చెప్పింది. అయిన‌ప్ప‌టికి ఆయ‌న శాంతించ‌క‌పోవ‌డంతో అలీ కాళ్ళ‌పై ప‌డి క్ష‌మాప‌ణ‌లు కోరింది. ఆయన శాంతించని అలీ…కొద్దిసేపటి తర్వాత మళ్ళీ మాట్లాడి గొడవ సెటిల్ చేసుకున్నాడు.

 

అటు  దొంగ‌లుగా ఉన్న శ్రీముఖి, అషూ, ర‌విలు నిధిని దొంగిలించేందుకు అనేక ప‌థ‌కాలు వేశారు. ర‌వి, అషూలు కొద్ది సేపు జైలులో ఉండ‌డంతో శ్రీముఖి మొత్తం బాధ్య‌త‌ని తీసుకొంది. వ‌రుణ్‌ని మాట‌ల‌లో పెట్టి ట్రంక్ పెట్టె ద‌గ్గ‌ర‌కి తీసుకొచ్చి ఆయ‌న జేబులో ఉన్న డ‌బ్బుని బాక్స్‌లో వేసింది. ఇక పోలీసుల‌కి కొద్ది పాటి లంచం ఇచ్చి అషూ ముందు బ‌య‌ట‌కి వ‌చ్చింది. తర్వాత రవి బయటకొచ్చాడు. వీరు ముగ్గురు కలిసి నిధి అద్దాల‌ని ప‌గ‌ల‌గొట్టాల‌ని డిసైడ్ అయ్యారు.

 

ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం డంబెల్‌తో నిది ద‌గ్గ‌ర‌కి వెళ్లిన శ్రీముఖి .. నిధి చుట్టు వరుణ్, వితికా, తమన్నా, మహేష్‌లు కాపలా ఉన్నా ధైర్యం చేసి డంబెల్‌తో నిధి అద్దాలను పగలగొట్టింది. రవిని సైతం పగలగొట్టమమని శ్రీముఖి సలహా ఇవ్వడంతో అతను చేతితో అద్దాలను పగలగొట్టాడు. దీంతో అతని చేతికి బ‌ల‌మైన గాయం కావ‌డంతో పాటు రక్తం ధార‌ళంగా పారింది. వెంట‌నే అత‌నిని మెడిక‌ల్ రూంలోకి తీసుకెళ్లి వైద్యులు చికిత్స అందించారు. శ్రీముఖి త‌ప్పుడు ఆలోచ‌న‌తోనే ర‌వికి గాయ‌మైంద‌ని వితికా, రాహుల్‌లు ఆమెపై ఫైర్ అయ్యారు. అలాగే నిధికి సంబంధించిన విలువైన వ‌స్తువుల‌న్ని వ‌రుణ్ సోఫాలో ప‌డేశాడు. అవ‌న్ని ర‌వి కృష్ణ‌కే ఇవ్వాల‌ని కొంద‌రు అన్నారు. ఇక ఇంతలో ఎపిసోడ్ కి ఎండ్ పడింది.

 

 

Leave a Reply