ఊహించని విధంగా అలీ ఎలిమినేషన్: బోరుమన్న ఇంటి సభ్యులు…

ali elimination in big boss house and housemates full crying
Share Icons:

హైదరాబాద్:

బిగ్ బాస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి అర్ధం కాదని మరోసారి రుజువైంది. ఆదివారం ఎపిసోడ్ లో ఊహించని విధంగా అలీ ఎలిమినేట్ అయ్యాడు. అలీ ఎలిమినేషన్ తో హౌస్ లో సభ్యులు అంతా బోరుమన్నారు. అయితే ఈ ఎలిమినేషన్ కంటే కింగ్ నాగార్జున షోలోకి  ఓ స్పెషల్ గెస్ట్ ని తీసుకొచ్చారు. గత సీజన్ బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవహరించిన నానీని స్టేజ్ మీదకి తీసుకొచ్చారు. గ్యాంగ్ లీడర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా నాని బిగ్ బాస్ షోకి వచ్చారు.

ఇక నానీని సినిమాలో పాత్ర పెన్సిల్ పార్థసారథిగా నాగ్ ఇంటి సభ్యులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా నాని తాను ఒక స్క్రిప్ట్ అనుకొని అందులోని ఒక్కో పాత్రను ఒక్కో హౌస్‌మేట్‌కి ఇచ్చేశారు. అందులో మొదటగా  బాబా భాస్కర్ – పాట మధ్యలో వచ్చే క్యామియో రోల్. శిల్పా చక్రవర్తి – ఇంటెర్వల్‌కి ముందు ఎంట్రీ ఇచ్చి ట్విస్ట్ ఇచ్చే క్యారెక్టర్. హిమజ – అండర్ డాగ్‌ రోల్.. మెల్లగా స్టార్ట్ అయ్యి ఆ తరవాత ఒక గ్రూపునే భయపెట్టే క్యారెక్టర్. శివజ్యోతి – పల్లెటూరు నుంచి వచ్చి అక్కడున్న ఇన్నోసెన్స్‌ను స్ప్రెడ్ చేసే రోల్. అలీ రెజా – సడెన్‌గా కోపం వచ్చే క్యారెక్టర్ (మన్మథుడు సినిమాలో సునీల్ మాదిరి).

శ్రీముఖి – సౌండ్, రీసౌండ్ ఉన్న రోల్. రవికృష్ణ – ఇన్నోసెంట్‌గా ఉంటూ సినిమా ఆఖర్లో విలన్‌ వెనక నుంచి వచ్చే రోల్. మహేష్ – చిత్తూరు యాసలో మంచి కామెడీ ఉన్న రోల్. రాహుల్ – పులిహోర రాజా. పునర్నవి – సిసింద్రీలా ఎంటర్ అయ్యి ఆటమ్ బాంబులా పేలే రోల్. వితికా – ఇంట్లో వాళ్లందరినీ బాగా వాడేసుకుంటున్న ఒక కోడలు రోల్. వరుణ్ సందేశ్ – ఫరెవర్ ప్రేమికుడు రోల్ ఇచ్చారు. అయితే నాని ఎంటర్టైన్మెంట్ అయిపోయాక నాగార్జున ఎలిమినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. శనివారం రాహుల్ సేఫ్ అయినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.ఇక ఆదివారం రవి, అలీ,శ్రీముఖి, మహేశ్ లలో అలీ ఎలిమినేట్ అయినట్లు నాగ్ ప్రకటించారు. దీంతో ఇంట్లో అందరూ షాక్ అయ్యారు.

ముఖ్యంగా శివజ్యోతి, శ్రీముఖిలు బోరున ఏడ్చారు. అలాగే రాహుల్, బాబా భాస్కర్, రవి, వరుణ్ ఇలా అందరూ బాగా ఏడుస్తూనే ఉన్నారు. ఆ తరవాత అలీ ఇంట్లో నుంచి బయటికి వచ్చి నాగార్జునను కలిశాడు. అయితే, ఇంటి సభ్యులతో మరోసారి మాట్లాడే అవకాశాన్ని అలీకి నాగార్జున ఇచ్చారు. టెలిఫోన్ బూత్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఇంటి సభ్యులతో మాట్లాడించారు. అప్పుడు కూడా ఇంటి సభ్యులు బాగా ఎమోషనల్ అయ్యారు.

 

Leave a Reply