ఇక మద్యం దుకాణాలు నడిపేది ప్రభుత్వమే….అక్టోబర్ 1 నుంచి అమలు….

alcohol shops run ap government
Share Icons:

అమరావతి:

 

వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చిన నవరత్నాల్లో భాగంగా ఉన్న మద్యపాన నిషేధం దిశగా సీఎం జగన్ అడుగులేస్తున్నారు. ఇప్పటికే బెల్టు షాపులు రద్దు చేయడంలో బిజీగా ఉన్న ప్రభుత్వం….స్వయంగా మద్యం వ్యాపారంలోకి ప్రవేశించనుంది. అందుకు వీలు కల్పించేలా చట్టాన్ని మార్చాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లును మంత్రివర్గం నిన్న ఆమోదించింది.

 

ఇక మరో రెండు రోజుల్లో ఈ బిల్లు ఉభయ సభలకు రానుంది. చట్ట సవరణ తరువాత అక్టోబర్ 1 నుంచి ప్రైవేటు మద్యం దుకాణాల స్ధానంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రారంభం అవుతాయి. అలాగే మద్యం ధరలను కూడా పెంచడం ద్వారా ఎక్సైజ్ సుంకం ఆదాయాన్ని రూ. 2,500 కోట్లకు పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ధర అధికంగా ఉంటే, తాగేవారి సంఖ్య తగ్గుతుందన్నది ఎక్సైజ్ వర్గాల అభిప్రాయం.

 

ప్రభుత్వమే దుకాణాలు నిర్వహించినా, ఖర్చులన్నీ పోను ఆదాయం వస్తుందని తేల్చాయి. పైగా ప్రభుత్వ దుకాణాలైతే సమయపాలన కచ్చితంగా ఉంటుంది. బెల్ట్ షాపుల బెడద ఉండదు. బల్క్ అమ్మకాలు సాగవు. దీంతో మద్య నిషేధం అమలు దిశగా అడుగులు పడినట్టు అవుతుందన్నది ప్రభుత్వ అభిప్రాయం. ప్రస్తుతం ఏపీలో 4,380కి వరకూ మద్యం దుకాణాలుండగా, వీటిల్లో 800 నుంచి 1,300 వరకూ దుకాణాలు నూతన విధానంలో రద్దు కానున్నాయి.

Leave a Reply