‘ఇండియన్‌ ఫిలిం పర్స్‌నాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌’ అమితాబ్..

Share Icons:

బాలీవుడ్,29 నవంబర్:

గోవాలో ఐఫి చిత్రోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటులు బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌, అక్షయ్‌కుమార్‌, కరణ్‌ జోహార్‌లతో పాటు మరికొందరు ప్రముఖులు హాజరయ్యారు.

ఈ అవార్డు కార్యక్రమంలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది.  ‘ఇండియన్‌ ఫిలిం పర్స్‌నాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు  గెలుచుకున్న అమితాబ్‌కి అవార్డు ప్రకటించడానికి అక్షయ్‌ స్టేజ్‌పైకి వచ్చారు. ఈ సందర్భంగా అక్షయ్ మాట్లాడుతూ..‘అమెరికాకు సూపర్‌మ్యాన్‌ ఉంటే.. మన ఇండియాకు యాంగ్రీ యంగ్‌ మ్యాన్‌ ఉన్నారు’ అన్నారు. అనంతరం అమితాబ్‌ని అవార్డు అందుకోవడానికి స్టేజ్‌పైకి రావాల్సిందిగా కోరారు. బిగ్‌బి స్టేజ్‌ మీదకి రాగానే అక్షయ్‌ వెళ్లి ఆయన కాళ్లకు నమస్కరించబోయారు. అప్పుడు అమితాబ్‌ వద్దు అన్నట్లు అక్షయ్‌ని పైకి లేపుతూ ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు.

అమితాబ్‌ ట్వీట్‌

అక్షయ్‌ ఇలా చేసిన విషయాన్ని అమితాబ్‌ ట్విటర్‌ ద్వారా వివరిస్తూ.. ‘అక్షయ్‌ ఇలా చేయడం ఇబ్బంది క‌లిగించింది. అతను ఇలా చేసి ఉండకూడదు’ అని ట్వీట్‌ చేసి అక్షయ్‌ని ఆలింగనం చేసుకుంటున్న ఫొటో పోస్ట్‌ చేశారు.

మామాట: అలా కాళ్ళకు నమస్కారం చేయడం ఆయన సంస్కారాన్ని తెలుపుతుంది.

Leave a Reply