ఎస్పీ, బీఎస్పీలని బీజేపీనే కలిపింది….

Share Icons:

లక్నో, 11 జనవరి:

బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధినేత అఖిలేష్‌లు తమ పార్టీల పొత్తు వ్యవహారంపై రేపు మీడియా సమావేశాన్ని నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశానికి ఒక రోజు ముందే ఈ విషయంపై అఖిలేష్ స్పందించారు. తన భార్య డింపుల్ ప్రాతినిథ్యం వహిస్తున్న కన్నౌజ్ లో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ…. ఇప్పటి వరకు ఎస్పీ, బీఎస్పీ కలిసే అవకాశం రాలేదని… ఆ అవకాశాన్ని బీజేపీనే కల్పించిందని చెప్పారు. బీజేపీ చేస్తున్న కుట్రల వల్ల ఇప్పటికే ఏపీలో టీడీపీ, అస్సాంలో అసోం గణపరిషత్ పార్టీ, బీహార్ లో రాష్ట్రీయ లోక్ సమతా పార్టీలు ఎన్డీయే నుంచి బయటకు వచ్చాయని తెలిపారు.

ఇక గత ఏడాది జరిగిన ఉపఎన్నికల్లో యూపీలో బీజేపీ మూడు స్థానాల్లో ఓడిపోయిందని చెప్పారు. ఈ మూడింట్లో ముఖ్యమంత్రి యోగి, ఆయన డిప్యూటీ ప్రాతినిధ్యం వహించిన స్థానాలు (లోక్ సభ) కూడా ఉన్నాయని అన్నారు. ఈ ఊపును ఇలాగే ముందుకు తీసుకెళతామని చెప్పారు.

అయితే ప్రాంతీయ పార్టీలకు చెందిన పలువురు నేతలు అండగా ఉండటంతో, ఇప్పటికీ తామే బలమైన పార్టీ అని బీజేపీ భావిస్తోందని అన్నారు. కానీ ఆ పార్టీలన్నీ ఇప్పుడిప్పుడే బీజేపీకి దూరమవుతున్నాయని చెప్పారు.

మామాట: బీజేపీ ఇలాంటి అవకాశాలు చాలా రాష్ట్రాల్లో ఇచ్చిందిలే….

Leave a Reply