చంద్రబాబు వల్లే ధైర్యంగా ప్రజల దగ్గరకి వెళ్ళి ఓట్లు అడిగాం…

Share Icons:

కడప, 20 మే:

తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని మంత్రి అఖిల ప్రియ చెప్పారు. కడప జిల్లాలోని పెద్దదర్గాను మంత్రి అఖిలప్రియ ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

అయితే చంద్రబాబు కారణంగానే తామంతా తలెత్తుకుని ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడగగలిగామని ఆమె స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం గ్రామాల్లో అభివృద్ధి చేపట్టిందనీ, మహిళలను ఆదుకుందని మంత్రి గుర్తుచేశారు. అందువల్లే దైర్యంగా ప్రజలవద్దకు వెళ్లి ఓట్లు కోరామని చెప్పారు. మే 23 తర్వాత ఏపీలో భారీ మెజారిటీతో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందని ఆమె జోస్యం చెప్పారు.

మామాట: 23 తర్వాత కూడా ఇదే చెప్పండి

Leave a Reply