అంబానీ కొడుకు పెళ్లి కార్డు ఎలా ఉందో చూశారా…!

Share Icons:

ముంబై, 14 ఫిబ్రవరి:

భారత అపర కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతాల వివాహం వచ్చే నెల 9న జరగనున్న విషయం తెల్సిందే.

ఈ సందర్భంగా అంబానీ పంచే శుభలేఖలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఒక్కో శుభలేఖ ఖరిదు రూ. 1.50 లక్షల వరకూ ఉంటుందని తెలుస్తుండగా, దీని వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇక వెడ్డింగ్ కార్డును గులాబీరంగు బాక్స్ లో ఉంచి, పూలు, నెమళ్ల బొమ్మలతో దాన్ని అలంకరించారు. అలాగే లోపల కృష్ణ, రాధల వెండి ఫోటో ఫ్రేమ్‌ను కానుకగా ఉంచారు. ఇన్నర్ కంపార్ట్ మెంట్‌ను ఓపెన్ చేస్తే, ఆరంజ్ రంగులోని కార్డుపై ఆహ్వాన పత్రిక కనిపిస్తుంది.

అలాగే  ‘సూర్యదేవుడు’ ను తలచుకుంటూ అతిథులకు స్వయంగా సంతకాలు చేస్తూ ఆహ్వానాన్ని పలికే నీతా, ముఖేష్‌లు. ఇన్ని అద్భుతాలు ఉన్న ఆ శుభలేఖని మీరు చూడండి.

మామాట: అంబానీ కొడుకు పెళ్లి అంటే ఆ మాత్రం ఉంటుంది…

Leave a Reply