TRENDING NOW

మార్చి 1న వస్తున్న అజిత్ విశ్వాసం..

మార్చి 1న వస్తున్న అజిత్ విశ్వాసం..

హైదరాబాద్, 21 ఫిబ్రవరి:

తలా అజిత్ హీరోగా, శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘విశ్వాసం’ . సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన తమిళంలో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రజనీకాంత్ ‘పేట’తో పోటీపడుతూ రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది.

అయితే అప్పుడే తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ సమయంలో తెలుగులో గట్టి పోటీ ఉండటంతో, విడుదల వాయిదా వేసుకున్నారు. తాజాగా ఈ సినిమాను మార్చి 1వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ విషయాన్ని తెలియజేస్తూ ఫస్టులుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. యాక్షన్ కి .. ఎమోషన్ కి ప్రాధాన్యతనిచ్చిన ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటించింది. తమిళంలో 100 కోట్లకి పైగా షేర్‌ని రాబట్టిన ఈ సినిమా, తెలుగులో ఏ స్థాయి సందడి చేస్తుందో చూడాలి. 

treefurn AD
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
Life Homepathy

మామాట: తెలుగులో కూడా విశ్వాసం సత్తా చాటుతుందా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: