చెన్నై, 31 డిసెంబర్:
తల అజిత్, శివ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం విశ్వాసం. జనవరి 10న విడుదల కానున్న ఈ చిత్రంపై అభిమానులలో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే అజిత్‌కి తమిళంలోనే కాదు తెలుగులోను ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇక ఆయన సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. తాజాగా అజిత్ నటించిన విశ్వాసం చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఇందులో సన్నివేశాలు అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా చేస్తున్నాయి. జగపతి బాబు, అజిత్ మధ్య యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని ట్రైలర్‌ని బట్టి అర్ధమవుతుంది.
ఈ ట్రైలర్ లో గంటలో 34లక్షల రియల్ టైం వ్యూస్ ను అలాగే 5లక్షల 73వేల లైక్స్ తో ట్రెండింగ్ లో కొనసాగింది. తాజాగా చిత్ర ట్రైలర్ 12 పైగా వ్యూస్, 12 లక్షల లైక్స్ రాబట్టి హాట్ టాపిక్‌గా మారింది. సత్య జ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం అజిత్‌కి మంచి హిట్ ఇస్తుందని టీం భావిస్తుంది.
మామాట: మరి సినిమా ఏ రేంజ్లో ఉంటుందో..