ఎయిర్టెల్, వోడాఫోన్ కాల్ రింగింగ్ సమయం తగ్గింది..

Airtel, Voda Idea cut ringer timing to 25 seconds to match Jio
Share Icons:

ముంబై: సాధారణంగా ఫోన్ కాల్స్ రింగింగ్ 60 సెకన్లు వరకు ఉండేది. కానీ తర్వాత అవి 30 నుంచి 45 సెకన్లు వరకు తగ్గిపోయాయి. అయితే ఆ రింగింగ్ సమయం 25 సెకన్లకు తగ్గిపోనుంది. తాజాగా ఈ నిర్ణయాన్ని జియో అమలు చేస్తుండగా, ఇప్పుడు టెలికాం సంస్థలు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు కూడా అమలు చేయడానికి సిద్ధమయ్యాయి. అయితే జియో ఐయూసీ చార్జిలను ఎక్కువగా చెల్లిస్తున్నందువల్లే ఆ ఖర్చును తగ్గించుకోవడానికి రింగింగ్ సమయాన్ని 25 సెకన్లకు కుదించిందని ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు ఆరోపిస్తున్నాయి.

సాధారణంగా కాల్ చేసిన నెట్‌వర్క్ వారు అవతలి ఫోన్ లో వాడుతున్న నెట్‌వర్క్‌కు ఐయూసీ చార్జిలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలకు ఈ విధానంలో అధికంగా ఆదాయం సమకూరుతోంది. దీంతో జియో రింగింగ్ సమయాన్ని 25 సెకన్లకు కుదించింది. ఈ క్రమంలో రింగింగ్ సమయం తగ్గడం వల్ల కాల్ చేస్తే అవి మిస్డ్ కాల్స్ అయ్యేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది.

కాబట్టి అవతలి వ్యక్తులు కాల్స్ చేస్తే అప్పుడు ఆ నెట్‌వర్క్ వారు ఇవతలి నెట్‌వర్క్‌కు ఐయూసీ చార్జిలు చెల్లించాలి కాబట్టి.. తమకు ఆ ఖర్చు తగ్గుతుందని జియో భావిస్తుందని, అందుకనే ఆ కంపెనీ రింగింగ్ సమయాన్ని తగ్గించిందని ఇతర టెలికాం కంపెనీలు ఆరోపిస్తున్నాయి. ఇలా మొత్తం మీద అన్నీ నెట్ వర్కులు కాల్ రింగింగ్ సమయాన్ని 25 సెకన్లకు తగ్గించేశాయి.

బ్లూటూత్ స్పీకర్‌

మొబైల్స్ తయారీదారు హువావే.. ఓ మినీ బ్లూటూత్ స్పీకర్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో 40 ఎంఎం డ్రైవర్ ఉన్నందున దీన్నుంచి వచ్చే సౌండ్ అవుట్‌పుట్ క్వాలిటీగా ఉంటుంది. దీనికి వాటర్, స్వెట్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఇక ఈ స్పీకర్ ధర రూ.1,999 ఉండగా దీన్ని వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో కొనుగోలు చేయవచ్చు. అలాగే హువావే.. ఫ్రీలేస్ పేరిట నూతన వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్‌ను కూడా విడుదల చేసింది. వీటి ధర రూ.4,999 కాగా.. వీటిని కూడా ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయిస్తున్నారు.

అలాగే చైనా సంస్థ షియోమీ అమేజ్‌ఫిట్ జీటీఆర్ పేరిట ఓ నూతన స్మార్ట్‌వాచ్‌ను భారత్‌లో ఇటీవ‌లే విడుద‌ల చేసిన విష‌యం విదిత‌మే. ఇందులో 1.2 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, బయో ట్రాకర్, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 195 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు. కాగా ఈ వాచ్‌ను రూ.9,999 ధరకు వినియోగదారులకు అందిస్తున్నారు.

Leave a Reply