ఎయిర్టెల్ యూజర్లకు గుడ్ న్యూస్…బంపర్ ఆఫర్…

Share Icons:

హైదరాబాద్: దిగ్గజ టెలికాం సంస్థ…..తమ వినియోగదారులకు శుభవార్త చెప్పింది.  ఎయిర్‌టెల్ రూ.599 ప్రిపెయిడ్ ప్లాన్‌‌తో ఉచిత ఇన్సూరెన్స్ పొందొచ్చు. ఈ ప్లాన్‌లో రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. ఏ నెట్‌వర్క్‌కు అయినా అన్‌లిమిటెడ్‌గా కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వస్తాయి. దీనికి భారతీ ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు రూ.4 లక్షల ఉచిత ఇన్సూరెన్స్ అందించేందుకు భారతీ ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్‌తో జతకట్టింది.

ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. మూడు నెలల తర్వాత మళ్లీ ప్లాన్‌ను రీచార్జ్ చేసుకోవాలి. అప్పుడు మళ్లీ ఇన్సూరెన్స్ సేవలు కొనసాగుతాయి. మీరు ప్లాన్ రీచార్జ్ చేసుకోకపోతే ఇన్సూరెన్స్ ప్రయోజనం లభించదు. ప్లాన్ వాలిడిటీ ఉన్నంత వరకే ఇన్సూరెన్స్ ప్రయోజనాలు పొందొచ్చు.

ఎయిర్‌టెల్ ఉచిత ఇన్సూరెన్స్ కవరేజ్ 18 నుంచి 54 ఏళ్ల మధ్యలో ఉన్న వారికే వర్తిస్తుంది. ఎలాంటి పేపర్లతో పనిలేదు. మెడికల్ టెస్ట్‌లు కూడా అవసరం లేదు. ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ వివరాలు వెంటనే మీకు మెసేజ్ వస్తుంది. అలాగే ఇన్సూరెన్స్ కాగితాలు కూడా ఇంటికి డెలివరీ అవుతాయి. ప్రస్తుతం ఈ ఆఫర్ ఢిల్లీ పరిధిలోనే ఉంది. త్వరలోనే అన్నీ ప్రాంతాల్లో అందుబాటులోకి రానుంది.

ధరలు తగ్గించిన వివో…

ప్రముఖ చైనా మొబైల్స్ తయారీదారు వివో తన వై91, వై91ఐ ఫోన్ల ధరలను తగ్గించింది. వివో వై91కు చెందిన 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.8,990 ఉండగా ఈ ధరను రూ.500 తగ్గించారు. దీంతో ఈ ఫోన్‌ను రూ.8,490 ధరకు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. అలాగే వివో వై91ఐ ఫోన్‌కు చెందిన 2జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.7490 ఉండగా, దీన్ని కూడా రూ.500 తగ్గించారు. దీంతో ఈ ఫోన్‌ను రూ.6,990 ధరకు కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం తగ్గించిన ధరలకే ఈ రెండు వేరియెంట్లను విక్రయిస్తున్నారు.

బి‌ఎస్‌ఎన్‌ఎల్ ఆఫర్

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ఏపీ, తెలంగాణలలోని తన వినియోగదారులకు ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. రూ.698కు ఈ ప్లాన్ వినియోగదారులకు లభిస్తున్నది. ఇందులో భాగంగా కస్టమర్లకు ఎలాంటి వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు రావు. కేవలం 200 జీబీ డేటా మాత్రమే వస్తుంది. ఇక ఈ ప్లాన్ వాలిడిటీని 180 రోజులుగా నిర్ణయించారు.

 

Leave a Reply