ఢిల్లీలో అవిశ్వాసం పెడితే తమిళనాడులో కూసాలు కదిలాయి.. ఇదేలా?

Share Icons:

చెన్నై, మార్చి 17 :

కేంద్రం ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ ఎంపీలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే ఆ ప్రకంపనలు తమిళనాడు రాష్ట్రంలో ఏఐఏడిఎంకే పార్టీని తాకాయి. ఆ పార్టీలో ముసలం మొదలయ్యింది. ఓ సీనియర్ నేతను పళనీ-పన్నీర్ ద్వయం బహిష్కరించాయి. ఇంతకీ ఏం జరిగింది.

ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని నినదిస్తూ తెలుగు ఎంపీలు నినదిస్తున్నారు. ఇందులో భాగంగా వైసీపీ, తెలుగుదేశం పార్టీలో కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు కూడా ఇచ్చేశాయి. చంద్రబాబు నాయుడు ప్రకటించిన అవిశ్వాస తీర్మానానికి ఏఐఏడిఎంకే పార్టీ సీనియర్‌ నేత, అధికార ప్రతినిధి కేసీ పళనిస్వామి మద్దతు ప్రకటించారు. కావేరి మండలి ఏర్పాటుపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఈపరిస్థితుల్లో.. టీడీపీ ముందుకుతెచ్చిన అవిశ్వాస తీర్మానానికి అన్నాడీఎంకే మద్దతివ్వక తప్పదని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలే ఏఐఏడిఎంకేలో ప్రకంపనలు రేపాయి. సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలతో ఖంగుతిన్న సిఎం ఎడప్పాడి పళనిస్వామి, డిప్యూటీ సిఎం పన్నీర్‌సెల్వంలు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. తమ పార్టీ అధికార ప్రతినిధి కేసీ పళనిస్వామిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు.

తనపై వేటు వేయడాన్ని పళనీ స్వామీ ఖండించారు. సిఎం ఈపీఎస్‌, డిప్యూటీ సిఎం ఓపీఎస్‌లపై మండిపడ్డారు. వారి బండారం బయటపెడతానని హెచ్చరించారు. పార్టీలో చీలిక ఖాయమని చెబుతున్నారు.

మామాట : తమిళనాడు సిఎం, డిప్యూటి సిఎం పదవుతు తుమ్మితే ఊడే ముక్కులు.. వాటిని కాపాడుకోవద్దా..!

English Summary :
No confidence motion effected the Tamilnadu politics. AIADMK Official spokes person expressed his support to the TDP’s no confidence motion. Tamilnadu CM Palani swamy and Deputy CM Panneer selvams send notification which is decided to cancel the primary subscription of that official spokes person in AIADMK.

Leave a Reply