అలా కలిసొస్తుంది.. ఏం చేయాలో అదే చేస్తా…

after-the-yesterday-match-rohith-sharma
Share Icons:

కోల్‌కతా, 10 మే:

బుధవారం రాత్రి క్రికెట్ గడ్డ ఈడెన్‌ గార్డెన్‌లో కోల్‌కతా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు వీరవిహారం చేశారు.  ముంబై యువ ఆటగాడు ఇషాన్ కిషన్ (21 బంతుల్లో 62; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) సంచలన బ్యాటింగ్‌కు, మరో కుర్రాడు సూర్యకుమార్ యాదవ్ (32 బంతుల్లో 36; 5 ఫోర్లు, 1 సిక్స్) సూపర్ ఫామ్ తోడుకావడంతో ఐపీఎల్లో రోహిత్‌సేన హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది.

అయితే గత మూడు ఐపీఎల్ టోర్నీల ప్రారంభంలో దారుణ వైఫల్యాలను చవిచూసే ముంబై ఇండియన్స్‌… పోనుపోను పుంజుకుంటూ.. చివరికి టైటిల్‌ విజేతగా నిలుస్తుండటం అలవాటు అయిపోయింది. ఇక ఎప్పుడు జరగడంపై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. తాము మే నెలలోనే మేం అద్భుతంగా రాణించడం జరుగుతోందని, గత మూడేళ్లుగా టోర్నీ సెకండాఫ్ లోనే బాగా ఆడుతున్నామని, అదేంటో తమకి అలా కలిసొచేస్తుందని వ్యాఖ్యానించాడు.

ఇక ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైన కోల్‌కతా జట్టు కెప్టెన్ దినేష్ కార్తీక్ మాట్లాడుతూ…. ఓటమి బారి నుంచి ఎంత తొందరగా బయటపడతామన్నదే ఆటలో కీలకమని, నాయకుడిగా తన 11 మంది సైన్యాన్ని నమ్మానని,  ఎప్పటికీ నమ్ముతూనే ఉంటానని అన్నాడు. ఇక ఖచ్చితంగా తాము ప్లే ఆఫ్స్‌కు వెళతామన్న పట్టుదల వాళ్లలో కలుగజేస్తానని, కెప్టెన్‌గా ఏం చెయ్యాలో అదే చేస్తానని దినేశ్‌ కార్తీక్‌ వ్యాఖ్యానించాడు.

మామాట: గెలిచినోళ్ళకి ఆనందం…ఓడిపోయినొళ్ళకి బాధ మామూలే…

Leave a Reply