మన దేశాన్నే సరిగా పాలించలేకపోతున్నాం…ఇక మనకు కశ్మీర్ ఎందుకు…

Share Icons:

ఇస్లామాబాద్, 14 నవంబర్:

భారత్-పాకిస్థాన్-కశ్మీర్ గొడవపై పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశాడు. మన దేశంలో ఉన్న నాలుగు ప్రావిన్స్‌లనే సరిగా చూసుకోలేకపోతున్నామని, ఇక మనకు కశ్మీర్ ఎందుకని అన్నాడు. తాజాగా లండన్‌లో మీడియాతో అఫ్రిదీ మాట్లాడుతూ…కశ్మీర్ గురించి పాకిస్థాన్ మరిచిపోవాలని… పాకిస్థాన్‌ను మంచిగా చూసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు.

ఇక ఉగ్రవాదుల నుంచి సొంత దేశాన్ని రక్షించడం కూడా తమ ప్రభుత్వాలకు చేత కాలేదని అఫ్రిది తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అలాగే కశ్మీర్ లోయలో ప్రజలు చనిపోవడం తనను ఎంతో బాధిస్తోందని, అయితే కశ్మీర్‌ను ఇండియాకు కూడా ఇవ్వొద్దని… అది ప్రత్యేక దేశం కావాలని అన్నాడు. కశ్మీర్‌లో మానవత్వం వికసించాలని ఆకాంక్షించాడు. కాగా, అఫ్రిది వ్యాఖ్యలు పాకిస్థాన్‌లో వివాదాస్పదం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మామాట: నీ మాటలు మీ దేశ ప్రధాని ఒప్పుకుంటారా…

Leave a Reply