అమ్మా నీకు వంద‌నం

Share Icons:

ఆఫ్ఘ‌నిస్తాన్‌, 22 మార్చి:

ఉన్నత విద్య అభ్యసించాలన్న తాపత్రయం..ఆ తల్లికి ఎలాంటి అడ్డు రాలేదు. ఆఫ్ఘ‌నిస్తాన్‌కు చెందిన 25 ఏళ్ల జహాన్ అనే మహిళ తన చంటి బిడ్డను ఒడిలో ఉంచుకుని పరీక్ష రాసిన సంఘటనకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఆ చిత్రాన్ని చూసిన యావత్‌ ప్రపంచం మేటి మహిళ అంటూ ఆమెకు జేజేలు పలుకుతోంది. ఈ అద్భుత దృశ్యం ఆఫ్ఘ‌నిస్తాన్‌లోని డేకుండి ప్రావిన్స్‌లోని కనిపించింది.

జహాన్ తాబ్ అనే మహిళకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త ఓ రైతు. పెళ్లి జరిగినప్పటికీ ఆమెకు ఉన్నత విద్యను అభ్యసించాలనే కోరిక ఉండేది. దీంతో పట్టు విడవకుండా చదువును కొనసాగిస్తోంది. తాజాగా ఆమె సోషల్‌ సైన్స్‌ కోర్స్‌లో చేరడానికి ఓ యూనివర్సిటీ నిర్వహించిన ఎంట్రెన్స్ టెస్ట్ రాయాలనుకుంది.

ఆ పరీక్ష తేదికి రెండు నెలల ముందే ఆమె మూడో బిడ్డకు జన్మనిచ్చింది. ఇదే సమయంలో ఎగ్జామ్స్ రాయాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో ఆమె తన బిడ్డను తీసుకుని పరీక్షా కేంద్రానికి వచ్చింది.

చిన్న పాప కావడంతో పరీక్ష రాస్తున్న సమయంలో గుక్కపట్టి ఏడుస్తుండటంతో ఇన్విజిలేటర్‌ అనుమతితో, వెంటనే పరీక్ష టేబుల్‌ మీదనుంచి లేచివచ్చి, వేరొక విద్యార్థిని కుర్చీ వెనుక నేలపై కూర్చుంది. ఒకవైపు బిడ్డకు స్తన్య మిస్తూ, మరొకవైపు పరీక్ష రాయడం కొనసాగించింది. లెక్చరర్ ఇర్ఫాన్‌ ఆ ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఈ ఫొటో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది.

ఆ లెక్చరర్ కొన్ని కారణాలతో తన పోస్ట్‌ను డిలీట్ చేసినప్పటికీ అప్పటికే ఈ ఫొటోను చాలా మంది షేర్ చేశారు. కుటుంబ బాధ్యతలు, కట్టుబాట్లను అధిగమించిన ఆమె పట్టుదలకు ప్రపంచం హ్యాట్సాఫ్‌ చెబుతోంది. బ్రిటీషు సంస్థ ఆర్థిక సహా యంతో ఆమె ఉన్నత విద్యను అభ్యసిస్తోంది.

మామాట: అందరికి ఆదర్శంగా నిలిచిన మహిళా…

English Summary: A woman sits on the floor of a classroom, nursing her baby while simultaneously taking a high-stakes exam, as dozens of other students around her do the same. The extraordinary scene, set in a private university in Afghanistan’s Daykundi province, was captured in a compelling photo that went viral on social media.

Leave a Reply