రంకు నేరం కాదు .. సుప్రీం సంచలన తీర్పు

Share Icons:

 కొత్త ఢిల్లీ, సెప్టెంబర్ 27

భారత సుప్రీం కోర్టు మరో సంచలన తీర్పు వెలువరించింది. ఇక దేశంలో రంకు బొంకు కాదని చెప్పింది. ప్రధాన న్యామమూర్తి దీపక్ మిశ్రా సార్థ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 150 సంవత్సరాలుగా అమలులో ఉన్న అడల్ట్రీ (వ్యభిచార)చట్టానికి కొత్త భాష్యం చెప్పింది. వివరాలు…

ఇది సమానతను గుర్తించవలసిన సమయం, భార్యకు, భర్తకు తేడా ఉండకూడదు. భర్తుకు ఎక్కువ హక్కులు ఉండవన్నారు. వ్యభిచారం నేరం కాదు, అది సివిల్ తప్పుకు పునాది, విడాకులకు మంచి కారణం మాత్రమేనని ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. తాజా తీర్పు వెలువరించిన ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి సహా న్యాయమూర్తులు ఏఎం.కన్వికర్, ఆర్ ఎఫ్. నారిమన్, డివై. చంద్రచూడ్, ఇందు మల్హోత్రా ఉన్నారు.

కాగా ఇటలీ లో ఉంటున్న కేరళకు చెందిన ప్రవాస భారతీయుడు జోషెప్ షైన్ దాఖలు చేసిన పిల్ విచారణలో భాగంగా తాజా తీర్పు వెలువడింది.

ఇదివరకు ఐపిసీలో ని సెక్షన్ 497 మేరకు భర్తకు భార్య యొక్క ప్రియునిపై చట్టపరమైన చర్యలు తీసుకునే వీలుండేది కానీ, భార్యకు  తన భర్తతో వివాహేతర సంబంధం ఉన్న మహిళను ప్రశ్నించే అవకాశం ఉండేది కాదు. ఇదే కారణంతో సెక్షన్ 198(2) మేరకు భర్త తన భార్య ప్రియునిపై క్రిమినల్ చర్యలు తీసుకునే వీలుండేది.  ఇక పై ఆ అవకాశం లేదు.

మామాట:కొత్తపుంతలు తొక్కుతున్న తీర్పులు

Leave a Reply