కొండ మీద కొత్త వ్యాపారం… లడ్డూ రూ. 50

Share Icons:
  • ఏకాదశి నుంచి మిగిలిన లడ్డూలు 7 లక్షలు

  • లడ్డూల ద్వారా వచ్చే రాబడి 3.5 కోట్లు

  • అధిక ధరకు యాత్రికులకు అంటగట్టే ప్రయత్నం

అడిగిన యాత్రికులకు అడిగినన్ని లడ్డూలను సరఫరా చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఇప్పటికే
ఈ వెసులుబాటు అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇప్పటి వరకూ ఇచ్చే రెండు లడ్డూలను పదికి పెంచేసింది. కొత్త వ్యాపారానికి తెర తీసింది. వివరాలిలా ఉన్నాయి.

తిరుమల కొండ ప్రసాదమంటే చాలా మందికి ప్రీతిపాత్రం, పరమ పవిత్రంగా భావిస్తారు. ఒక ముక్క లడ్డూ దొరికితే నేరుగా
తిరుమల వెంకన్న దర్శనం దొరికినట్లే లెక్క.

అయితే తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే యాత్రికులు ఇప్పటి వరకూ రెండు లడ్డూలు మాత్రమే అదనంగా ఇస్తుండగా ఇకపై 10 లడ్డూల వరకు ఇవ్వనున్నారు. మంగళవారం నుంచి ఎటువంటి సిఫారసు లేకుండా భక్తుడు కోరితే 6 లడ్డూల వరకు ఇస్తున్నారు.

అదనపు రాబడి రూ. 3.5 కోట్లు

యాత్రికులకు కోరినన్ని లడ్డూలు అందజేయాలన్న లక్ష్యంతో టీటీడీ పని చేస్తోందని టీటీడీ అధికారగణం చాలా చక్కగా సెలవిస్తోంది. ఈ లక్ష్యం వెనుక అర్థం ఏంటి? పరమార్థం ఏంటి? అది ప్రసాదమేకానీ, తినుబండారం కాదనే విషయం తిరుమల తిరుపతి దేవస్థానానికి స్పష్టంగా తెలుసు. అయినా సరే అంగట్లో సరుకులాగా అమ్మకాన్ని షురూ చేసేశారు.

అయితే ఇటీవల లడ్డూల తయారీని పెంచేశారు. జనవరి 1 నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అంచనాల ప్రకారం యాత్రికులు పెద్దగా కొనుగోలు చేయలేదు. దాదాపు 7లక్షల లడ్డూలు నిల్వ ఏర్పడ్డాయి. రెండు నియంత్రణ ఉండడంతో ఇచ్చిన కొనాలకునే వారు కొనుగోలు చేయలేక ఉన్న లడ్డూలతోనే సర్దుబాటు చేసుకుని వెళ్ళిపోయారు.

ఇక మిగిలిపోయిన లడ్డూలను చాలా రోజులు నిల్వ ఉంచలేం. కాబట్టి ఏం చేయాలి.? అదనపు లడ్డూల పేరుతో యాత్రికులకు తగలగట్టాలి. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో దుకాణం తెరిచేసింది. ఒక్కొక్క లడ్డూను రూ. 50 చొప్పున యాత్రికులకు అంటగడుతోంది.

అందుకే యాత్రికులు కోరితే 10 లడ్డూల వరకు ఇవ్వాలని సంబంధిత బుధవారం తిరుమల జేఈవో ఆ విభాగాన్ని ఆదేశించారు. ఇక అంతే లడ్డూ కౌంటర్‌లో వ్యాపారం మొదలయ్యింది. ఎటువంటి సిఫారసు లేకుండా ఒక్కొక్కరికి 10 లడ్డూలు అందించనున్నారు.

అదనంగా ఉన్న 7లక్షల లడ్డూలను అమ్మేస్తే టీటీడీకి రాబడి ఎంతో తెలుసా…? అక్షరాల రూ. 3.5 కోట్లు. లడ్డూ తయారీకి
అయ్యే ఖర్చు రూ. 25 అయితే టీటీడీ అమ్మేది రూ. 50కి ఇంతకంటే లాభసాటి వ్యాపరం మరోటి ఉంటుందా…?

మామాట : గోవిందా…! వెంకన్న స్వామిని మిమ్మల్ని కూడా అమ్మేస్తారు..

English Summary: Tirumala Tirupathi Temple has decided to supply addtional laddus to the pilgrims, how many they want. Already, This flexibility has been made available. The two laddoos that have so far brought up to ten.

Leave a Reply